Bihar CM Nitish Kumar : సీఎం సార్..నేను చనిపోలేదు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నా : నితీశ్ కుమార్‌కు లేఖ

ఆరు నెలల క్రితం చనిపోయాడనుకున్న ఓ యువకుడు సీఎంకు లేఖ రాశాడు. నేనుచనిపోలేదు సార్..ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నా నాపై మర్డర్ కేసు పెట్టటం సరికాదు అంటూ వివరించాడు.

Bihar CM Nitish Kumar : సీఎం సార్..నేను చనిపోలేదు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నా : నితీశ్ కుమార్‌కు లేఖ

Bihar CM Nitish Kumar

Bihar CM Nitish Kumar : చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చాడని..అంత్యక్రియలు చేశాక ప్రాణాలతో ఇంటికొచ్చాడు అనే వార్తలు వింటుంటాం.కానీ చనిపోయాడని అనుకున్న ఓ వ్యక్తి ‘నేను చనిపోలేదు సార్’ అంటూ ఏకంగా సీఎంకే లెటర్ రాశాడు. సీఎంతో పాటు డీజీపీకి కూడా లెటర్ రాశాడు. ఆ లెటర్ చదివిన పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఎందుకంటే ఎవరైతే లెటర్ రాశారో ఆ వ్యక్తి చనిపోయాడని పోలీసులే దృవీకరించారు. తాను చనిపోలేదని..ప్రేమించిన అమ్మాయితో పారిపోయారని ఆమెను వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నాను అంటూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు, డీజీపీకి రాసిన లెటర్ హాట్ టాపిక్ గా మారింది. ఇక్క మరో విశేషమేమిటంటే..సదరు వ్యక్తి చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు కూడా అంగీకరించటం..!

బీహార్ లోని డియోరియా అనే చిన్న గ్రామంలో 30 ఏళ్ల సోను కుమార్ శ్రీవాస్తవ కుటుంబం నివసిస్తోంది. ఆరు నెలల క్రితం ఓ రోజు పాట్నాలో వస్తువులు కొనటానికని బయటకు వెళ్లిన శ్రీవాస్తవ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన వాస్తవ కుటుంబ ఎన్నో చోట్ల వెతికారు.బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లాడని ఆరా తీశారు. తరువాత కుమార్ ఆచూకీ ఎంతకు తెలియకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమదో చేసుకున్ పోలీసులు కుమార్ కోసం వెదికారు. ఆయా ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించగా కుమార్ బస్సు దిగాక కొంతదూరం వెళ్లి కనిపించకుండాపోయాడు. దీంతో అతని కాల్ డేటా ఆధారంగా విచారణ చేశారు. కానీ ఎంతకూ ఆచూకీ తెలియలేదు.

ఈక్రమంలో పోలీసులకు డియోరియో గ్రామానికి సమీపంలో గొంతు కోసి ఉన్న ఓ మృతదేహం ఉన్నట్లుగా సమాచారం అందింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మృతదేహం 30 ఏళ్ల కుమార్ శ్రీవాస్తకు చెందినట్లుగా అనుమానించారు పోలీసులు. అతని కుటుంబ సభ్యులు చెప్పినట్లుగా పోలికలు సరిపోవటంతో పోలీసులు కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.వారి కూడా వచ్చి మృతదేహాన్ని పరిశీలించి చూశారు. ఆ తరువాత అది తమ కుమారుడిదేనని శ్రీవాస్తవ తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో పోలీసులు మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించిన తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం కిడ్నాప్, హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈక్రమంలో తాజాగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో పాటు డీజీపీకి, అలాగే డియోరియా గ్రామ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వోకు శ్రీవాస్తవ పేరుతో ఓ లెటర్ వచ్చింది. ఆ లేఖ చదివి పోలీసులు షాక్ అయ్యారు. ఈ లేఖలో తాను చనిపోలేదని..ప్రేమించిన అమ్మాయితో పారిపోయి వచ్చానని..ఆమెను వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నాను అంటూ లేఖలో పేర్కొన్నాడు. తాను పక్క గ్రామానికి చెందిన అమ్మాయిన ప్రేమించానని ఇద్దరు కలిసి ఉత్తరప్రదేశ్ వచ్చేశామని ఇద్దరం వివాహం చేసుకుని ఘజియాబాద్ లో స్థిరపడ్డామని నాపై కిడ్నాప్, మర్గర్ కేసు పెట్టటం సరికాదు అంటూ లేఖలో వివరించాడు. దీంతో ఈ విషయాన్ని పోలీసులు శ్రీవాస్తవ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కేసు విచారణను కొనసాగిస్తున్నారు.