Rahul Gandhi : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ

ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తానని చెప్పారు. గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని భారతదేశ ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తామన్నారు.

Rahul Gandhi : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ

Rahul

Rahul Gandhi : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం చెందింది. పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓడిపోయింది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా హస్తం పార్టీ ఎక్కువ స్థానాలు సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు, వాలంటీర్ల కృషికి.. అంకితభావానికి కృతజ్ఞతలు తెలిపారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని భారతదేశ ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తామని అన్నారు.

పంజాబ్ లో ఆప్ విజయం సాధించగా కాంగ్రెస్ ఓటమిని చవిచూసింది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ కన్న కలలు నెరవేరలేదు. ఘోరమైన పరాజయం దిశగా ముందుకెళుతోంది. ఈ రాష్ట్రంలో ఆప్ పార్టీకి పట్టం కట్టారు. స్పష్టమైన మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రెడీ అవుతోంది ఆప్ పార్టీ. ఆప్ సృష్టించిన దూకుడుకు కాంగ్రెస్ తో సహా ఇతర పార్టీలు కొట్టుకపోయాయి.

UP Congress : ప్చ్ ప్రియాంక..! కాంగ్రెస్ ఓటమికి కారణాలివే..!

సరైన గేమ్‌ ప్లాన్‌ లేకుండా బరిలోకి దిగిన కాంగ్రెస్‌కు చుక్కలు ఆమ్‌ ఆద్మీ పార్టీ చూపించింది. కాంగ్రెస్‌ తగిన మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా ఏ ఆటగాడిని నమ్మకూడదో అతడ్నే కోచ్‌గా చేసి నట్టేట మునిగిపోయింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం చేశాడని విమర్శలు గుప్పుమంటున్నాయి. క్రికెట్‌లో మంచి ఆటగాడే కావచ్చు కానీ.. రాజకీయాల్లో మాత్రం నవజ్యోత్ సింగ్‌ సిద్ధూ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు తక్కువ.. వెన్నుపోటుకు ఎక్కువ అన్నట్లు ఆడుతుంటారనే విమర్శలున్నాయి.

సొంత టీమ్‌లో స్ఫూర్తి నింపాల్సిన సిద్ధూ చాలా సార్లు ప్రత్యర్థి టీమ్‌లకు ఉచిత కోచింగ్‌ ఇచ్చారని, ఇప్పుడు ఆ సిద్ధూనే పటిష్టమైన కాంగ్రెస్‌ టీమ్‌ను క్లబ్‌ స్థాయి టీమ్‌గా దిగజార్చాడని ఆరోపిస్తున్నారు. నమ్మిన పార్టీ పెద్దల పరువును కౌంటింగ్‌ గ్రౌండ్‌లోనే ఊడ్చిపడేశాడని ఎన్నికల ఫలితాలు చూసిన వెల్లడిస్తున్నారు.