Corona Danger Bells : ఇంట్లో ఉన్న మాస్క్ కంపల్సరీ, నిర్లక్ష్యం చేస్తే…తీవ్ర పరిణామాలు – వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర హెచ్చరికలు

కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరుపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

Corona Danger Bells : ఇంట్లో ఉన్న మాస్క్ కంపల్సరీ, నిర్లక్ష్యం చేస్తే…తీవ్ర పరిణామాలు – వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర హెచ్చరికలు

Corona Bells

Telangana : కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరుపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గత నాలుగు వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడారు. ఒకరికి వైరస్ సోకిన కొన్ని గంటల్లోనే..ఇంట్లో వారందిరికీ సోకుతోందన్నారు. బయట ఉన్పప్పుడే కాదు..ఇంట్లో ఉన్నా…మాస్క్ కంపల్సరీ అని తెలిపారు. మరో ఆరు వారాలు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు సహకరించకపోతే మహారాష్ట్రలా మారే ప్రమాదం ఉందని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. మున్ముందు ఆసుపత్రుల్లో బెడ్ దొరక్కుండా పోయే ప్రమాదం ఉందని, పరిస్థితి తెలంగాణలోనూ తీవ్రంగా ఉందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు రావొద్దని లాక్ డౌన్, కర్ఫ్యూ పెట్టడం లేదని వివరించారు. ప్రజలు స్వీయ నియంత్రఃణ పాటించాలని, మాస్క్ లు లేకుండా బయట తిరగవద్దన్నారు.

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ విజృంభిస్తోంది. ప్రజల నిర్లక్ష్యం కూడా కొంత కారణమని అధికారులు వెల్లడిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని చెబుతున్నా…కొంతమంది డోంట్ కేర్ అనుకోవడంతో..వైరస్ వ్యాపిస్తోందంటున్నారు. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, లేనిపక్షం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ చేసిన హెచ్చరికలతో అయినా..పరిస్థితిలో మార్పు వస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

Read More : Corona Second Wave : షాకింగ్.. దేశంలో రోజుకు 3ల‌క్ష‌ల కేసులు, మే చివ‌రి వ‌ర‌కూ తీవ్రత