ICC CEO : ఒలింపిక్స్‌‌లో క్రికెట్.. సంపాదన కోసం కాదన్న ICC సీఈవో

క్రికెట్ ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడంతో పాటు నాన్ క్రికెటింగ్ మార్కట్ కి విస్తరించడమే తమ ప్రధాన ధ్యేయమని సీఈవో గెఫ్ తెలిపారు. ఒలింపిక్స్ లో క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేసి...

ICC CEO : ఒలింపిక్స్‌‌లో క్రికెట్.. సంపాదన కోసం కాదన్న ICC సీఈవో

Icc Ceo

Cricket In Olympic : ఒలింపిక్స్ లో క్రికెట్ అంశం విషయంలో ICC సీఈవో గెఫ్ అలార్డైస్ స్పందించారు. ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చేందుకు బిడ్ వేస్తున్న విషయంలో పలు వార్తలు వెలవడుతున్న సంగతి తెలిసిందే. సంపాదనే లక్ష్యంగా వేస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. తాము సంపాదనే లక్ష్యంగా ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చేందుకు బిడ్ వేయడం లేదని వ్యాఖ్యానించారు. 2028 ఒలింపిక్స్ కోసం స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్ తో సహా 28 క్రీడల ప్రాథమిక జాబితాను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. బర్మింగ్ హోమ్ వేదికగా జరగబోయే కామన్ వెల్త్ గేమ్స్ లో మహిళల టీ20 క్రికెట్ కు స్థానం దక్కింది.

Read More : IPL2022 RR Vs MI : ఎదురులేని రాజస్తాన్.. రెండో విజయం.. ముంబైకి రెండో ఓటమి

1998లోనే పురుషుల క్రికెట్ ఆరంగ్రేటం అయ్యింది. క్రికెట్ ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడంతో పాటు నాన్ క్రికెటింగ్ మార్కట్ కి విస్తరించడమే తమ ప్రధాన ధ్యేయమని సీఈవో గెఫ్ తెలిపారు. ఒలింపిక్స్ లో క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేసి మార్కెట్ ను విస్తరించడమే తమ ధ్యేయమన్నారు. కమిటీలోని 106 మంది సభ్యులకు వారి దేశాల ప్రభుత్వాలతో మరింత సన్నిహితంగా కలిగే అవకాశం దక్కుతుందన్నారు. క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్పించేందుకు కృషి చేసేందుకు అక్కరకొస్తుందని సీఈవో అలార్డెస్ తెలిపారు. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ లో కానీ, 2032 బ్రిస్బేన్ వేదికగా జరిగే క్రీడల్లో క్రికెట్ ను చేర్చాలని ఐసీసీ కృషి చేస్తోంది.

Read More : IPL2022 MI Vs RR : సెంచరీ బాదిన బట్లర్… ముంబై టార్గెట్ 194

క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందికిపైగా అభిమానులున్నారు. ఇందులో చాలా మంది ఒలింపిక్స్ లో క్రికెట్ ను చూడాలని అనుకుంటున్నారు. మరెన్నో క్రీడలు కూడా ఒలింపిక్స్ లో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న క్రమంలో.. క్రికెట్ ను చేర్చడం కొంత కష్టమేనంటూ విశ్లేషణలు చేస్తున్నారు. అయినా.. తమ ప్రయత్నాలు సాగిస్తామని ICC వెల్లడించింది.