Crocodiles: వామ్మో.. ఇళ్లలోకి వచ్చిన 250కిపైగా మొసళ్లు.. భయంతో వణికిపోయిన ప్రజలు.. ఎక్కడంటే?

నదిలోనో, చెరువులోనో మొసళ్లు ఉన్నాయంటేనే మనం అటువైపు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తాం.. అలాంటిది.. ఒకేసారి 250కిపైగా మొసళ్లు నివాస గృహాల్లోకి వస్తే.. భయంతో వణికిపోవాల్సిందే. ఇలాంటి ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో చోటు చేసుకుంది.

Crocodiles: వామ్మో.. ఇళ్లలోకి వచ్చిన 250కిపైగా మొసళ్లు.. భయంతో వణికిపోయిన ప్రజలు.. ఎక్కడంటే?

Crocodiles (1)

Crocodiles: నదిలోనో, చెరువులోనో మొసళ్లు ఉన్నాయంటేనే మనం అటువైపు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తాం.. అలాంటిది.. ఒకేసారి 250కిపైగా మొసళ్లు నివాస గృహాల్లోకి వస్తే.. భయంతో వణికిపోవాల్సిందే. ఇలాంటి ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో చోటు చేసుకుంది. గుజరాత్ లో పలు ప్రాంతల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నదులు, చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వడోదర ప్రాంతంలోని విశ్వామిత్ర నదిలోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతుంది. దీంతో ఆ నదిలోని మొసళ్లు ఒడ్డుకు వస్తున్నాయి.

Indonesia crocodile : మొనగాడొచ్చాడు..13 అడుగుల మొసలి మెడలో టైర్ తీసాడు..రూ.కోట్ల బహుమతిని ఏంచేశాడంటే..

విశ్వామిత్ర నది ఒడ్డున ఉన్న ఎత్తైన భవనాల్లోకి మొసళ్లు వస్తున్నాయి. దాదాపు 250కిపైగా మొసళ్లు భవనాల్లోకి ప్రవేశిస్తుండటంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో ప్రభుత్వం అటవీశాఖ ప్రత్యేక బృందాలను మొసళ్లు ప్రవేశించిన ప్రాంతానికి పంపించింది. గతంలో ఈ ప్రాంతంలో బయటకు వెళ్లిన పలువురిని మొసళ్లు నోటకర్చుకొని ఈడ్చుకెళ్లిన ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో స్థానిక ప్రజలు మొసళ్లను చూసి భయంతో వణికిపోతున్నారు. ప్రత్యేకించి వర్షాకాలం సమయంలో తరచుగా ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.

గుజరాత్ లోని వన్సారి, వల్సాద్ తో సహా పలు జిల్లాల్లో గత కొన్నిరోజులుగా కుండపోత వర్షాల కారణంగా నిలుస్తున్న నీటితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా తాపీ నదిపై నిర్మించిన ఉకై డ్యామ్ నుంచి 60వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. వరదల కారణంగా సంభవించిన విధ్వంసంపై సర్వే చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు. నష్టపోయిన ప్రజలకు అవసరమైన ఆర్థిక సహాయం కూడా అందించాలని సూచించారు.