Deepika Padukone: మిడిల్ ఫింగర్ చూపిస్తూ మీడియాపై రెచ్చిపోయిన దీపికా!

బాలీవుడ్‌లో అందంతోపాటు అభినయం ఉన్న నటి దీపికా పదుకొనే. రణ్‌వీర్‌ సింగ్‌తో పెళ్లి తర్వాత కూడా క్రేజీ ఆఫర్లు అందుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతోంది. బాలీవుడ్‌లో గత కొద్దికాలంగా హీరోయిన్..

Deepika Padukone: మిడిల్ ఫింగర్ చూపిస్తూ మీడియాపై రెచ్చిపోయిన దీపికా!

Deepika Padukone

Deepika Padukone: బాలీవుడ్‌లో అందంతోపాటు అభినయం ఉన్న నటి దీపికా పదుకొనే. రణ్‌వీర్‌ సింగ్‌తో పెళ్లి తర్వాత కూడా క్రేజీ ఆఫర్లు అందుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతోంది. బాలీవుడ్‌లో గత కొద్దికాలంగా హీరోయిన్ ఓరియెంటెట్ పాత్రలు ధరించడమే కాకుండా నిర్మాతగా కూడా ప్రయోగాలు చేస్తున్న దీపికా.. తాను నటించే సినిమాల్లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకొంటూ ముందుకెళ్తుంది. బాలీవుడ్‌లో హీరోలకు సమానంగా ఉండే పాత్రల్లో నటించి మెప్పిస్తున్న ఈ కన్నడ సోయగంపై ఈ మధ్య కాలంలో విమర్శలు కూడా భారీగానే వస్తున్నాయి.

Deepika Padukone: నీ డ్రెస్ రణ్వీర్ డిజైన్ చేశాడా.. దీపికాపై నెటిజన్ల ట్రోలింగ్

ఈ మధ్యనే వచ్చిన గెహ్రియాన్ సినిమాలో దీపికా నటన బెడ్రూమ్ సన్నివేశాలపై భారీ విమర్శలు చూసిన దీపికా వాటిని ధైర్యంగా ఎదుర్కొంది. అదలా ఉండగానే మరో సినిమాపై కూడా అదే స్థాయిలో విమర్శలు చూడాల్సి వచ్చింది. దీపికా ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ స్పెయిన్‌లో జరుగుతోంది. అక్కడ దీపికా పదుకొణె, షారుఖ్‌లకు సంబంధించిన కీలక సన్నీవేశాలను షూట్ చేస్తుండగా అందుకు సంబంధించిన ఫోటోలు లీకైన విషయం తెలిసిందే.

Deepika Padukone: మల్టీ టాస్కింగ్ దీపికా.. ఏ అవకాశాన్నీ వదలుకొనేదేలేదు!

స్పెయిన్‌లో బహిర్గత ప్రదేశంలోనే ఈ సినిమా షూటింగ్‌ జరగడగా అక్కడి మీడియా దీపికా ఫోటోలను తీసి పబ్లిష్ చేసింది. అయితే అందులో దీపికా లోదుస్తులు ధరించి, హాట్‌గా కనిపించడంతో ఈ ఫోటులో సోషల్ మీడియా తెగ వైరల్ అయ్యాయి. గెహ్రియాన్ సినిమా సమయంలో పెళ్లయ్యాక ఇలాంటి వేషాలు ఏంటని అన్నట్లే ఈ ఫోటోలపై కూడా ఘోరంగా నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. దీంతో దీపికా అక్కడి మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Deepika Padukone: మై లైఫ్.. మై రూల్స్.. నా భర్త పర్మిషన్ కావాలనడమే ఛండాలం!

అంతేకాదు ఫోటోలు లీకైన తర్వాత రోజే మళ్ళీ షూటింగ్ స్పాట్ లో కనిపించిన మీడియాకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ తన కోపాన్ని చూపించింది. ఇప్పుడు ఈ ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో అదే స్థాయిలో వైరల్ అవుతున్నాయి. ఎంత నీ ఫోటోలు చూపిస్తే మాత్రం ఇలా అసభ్యకరంగా ప్రవర్తిస్తావా.. ఏం రేపు సినిమాలో సిల్వర్ స్క్రీన్ మీద ఎలాగూ ఈ సీన్లు కనిపించవా.. అప్పుడు మాత్రం ఏం చేస్తావ్ అంటూ నెటిజన్లు రెచ్చిపోతున్నారు. అయితే.. అసలు ఈ ఫోటోలు మీడియాను ఉద్దేశించే ప్రవర్తించిందా లేక ఇది కూడా షూటింగ్ లో భాగమా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.