Covid Protocols: కొవిడ్ రూల్స్ ధిక్కరించిన వారికి ఒక్క రోజులో రూ.74లక్షల ఫైన్
దేశ రాజధానిలో కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించకుండా యథేచ్ఛగా ప్రవర్తించిన వారికి ఢిల్లీ గవర్నమెంట్ జరిమానా విధించింది. ఒక్క రోజులో మొత్తం 14ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా రూ.74లక్షల 25వేల 900...

Covid Protocols
Covid Protocols: దేశ రాజధానిలో కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించకుండా యథేచ్ఛగా ప్రవర్తించిన వారికి ఢిల్లీ గవర్నమెంట్ జరిమానా విధించింది. ఒక్క రోజులో మొత్తం 14ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా రూ.74లక్షల 25వేల 900 జరిమానా విధించారు. దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీలలో మొత్తం 11జిల్లాల నుంచే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
కొవిడ్ రూల్స్ బ్రేక్ చేసినందుకు గానూ కేసులు నమోదు చేసినట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. 3వేల 732మంది మాస్కులు లేకుండా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తూ తిరిగారని అధికారులు తెలిపారు.
గడిచిన 24గంటల్లో ఢిల్లీలో 22వేల 751 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని.. గతేడాది మే1 తర్వాత ఇదే అత్యధికమని రికార్డుల్లో పేర్కొన్నారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన బులెటిన్ లో 23.53 శాతం పాజిటివిటీ రేటు ఉందని, 60వేల 733యాక్టివ్ కేసులు ఉండగా మొత్తం నమోదైన కేసులు 15లక్షల 49వేల 730.
ఇది కూడా చదవండి : ప్రసార భారతిలో ఉద్యోగాల భర్తీ
గడిచిన 24గంటల్లో 17మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోగా 25వేల 160మంది రికవరీ అయ్యారు.