Gay Judge: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. న్యాయమూర్తిగా ‘గే’!

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది సౌరభ్ కిర్‌పాల్‌ను నియమించే ప్రతిపాదనకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది

Gay Judge: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. న్యాయమూర్తిగా ‘గే’!

Gay

Delhi High Court: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది సౌరభ్ కిర్‌పాల్‌ను నియమించే ప్రతిపాదనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఎందుకంటే దేశంలోని మొదటి స్వలింగ సంపర్కుడు(GAY) న్యాయమూర్తి సౌరభ్ అవుతున్నారు.

2017లో అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్ నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు కొలీజియం కిర్‌పాల్‌ను ఎలివేషన్ కోసం సిఫార్సు చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

అయితే, కిర్‌పాల్‌ లైంగిక ఆసక్తిని పేర్కొంటూ అతని సిఫార్సుపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సిఫార్సుపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయడంపై గత నాలుగేళ్లుగా వివాదం నడుస్తోంది.

సౌరభ్‌ కిర్‌పాల్ మాజీ సీజేఐ బీఎన్‌ కిర్‌పాల్‌ కుమారుడు. విదేశీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తిని.. జీవిత భాగస్వామిగా చేసుకున్న సౌరభ్‌ కిర్‌పాల్‌.. గేతో సహజీవనం చేస్తున్న కారణంగా పక్కనబెట్టింది కేంద్రం.

TRS MLC: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ లిస్ట్.. మూడు సీట్లు.. రేసులో నలుగురు!

గే హక్కుల కోసం సుప్రీంలో పోరాడి విజయం సాధించిన సౌరభ్‌ కిర్‌పాల్‌.. చివరకు ఢిల్లీ హైకోర్టుకే న్యాయమూర్తిగా అయ్యే అవకాశం దక్కించుకున్నారు.

మరో నలుగురు న్యాయవాదులు తారా వితస్తా గంజు, అనీష్ దయాల్, అమిత్ శర్మ, మినీ పుష్కర్ణలకు ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని గతంలో చేసిన సిఫార్సును పరిశీలించాలని కూడా కొలీజియం నిర్ణయించింది.

ఆక్స్‌ఫర్డ్ మరియు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువు:
సౌరభ్ కిర్‌పాల్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో పట్టభద్రుడయ్యాడు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్‌లో న్యాయ పట్టా పొందాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్(LAW). రెండు దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు.

జెనీవాలోని ఐక్యరాజ్యసమితితో కూడా పనిచేశారు కిర్‌పాల్. ‘నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సౌరభ్ కీలకంగా వాదించారు. సెక్షన్ 377 తొలగింపు కోసం పిటిషనర్ తరఫు న్యాయవాది కూడా కిర్‌పాల్ యే. సెప్టెంబర్ 2018లో, సెక్షన్ 377కి సంబంధించిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.