Liquor Home Delivery: అతి త్వరలో ఇంటికే మద్యం డెలివరీ
దేశ రాజధాని ఢిల్లీలో అతి త్వరలోనే మద్యం హోం డెలివరీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మంత్రుల బృందం మంగళవారం ఆమోదం తెలిపింది. మార్కెట్ నిలకడగా వచ్చేంతవరకూ రేట్లలో ఎటువంటి మార్పులు ఉండబోవని ప్రభుత్వం సూచించింది.

Liquor Delivery
Liquor Home Delivery: దేశ రాజధాని ఢిల్లీలో అతి త్వరలోనే మద్యం హోం డెలివరీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మంత్రుల బృందం మంగళవారం ఆమోదం తెలిపింది. మార్కెట్ నిలకడగా వచ్చేంతవరకూ రేట్లలో ఎటువంటి మార్పులు ఉండబోవని ప్రభుత్వం సూచించింది.
ఎక్సైజ్ పోలీస్ 2022-23కి సంబంధించి హోం డెలివరీ ప్రతిపాదనలు, ఇతర సిఫారసులను ఢిల్లీ క్యాబినెట్ ఆమోదం కోసం ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
“ఢిల్లీలోని రిటైల్ లిక్కర్ దుకాణాల నుంచి లభించే మద్యం హోమ్ డెలివరీని అనుమతించవచ్చని మంత్రుల బృందం రికమెండ్ చేసింది” అని గత నెలలో జరిగిన GoM సమావేశం సందర్భంగా అధికారిక పత్రం తెలిపింది.
మహమ్మారి లేదా అత్యవసర పరిస్థితుల్లాంటి లాక్‌డౌన్‌ల సమయంలో మద్యం సరఫరాను ఆగకుండా ఉండేందుకు హోమ్ డెలివరీ సరైన ప్రత్యామ్నాయం అని GoM భావించింది. హోమ్ డెలివరీ నిబంధన ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్, 2010లోని రూల్ 66 కింద వస్తుంది.
ఢిల్లీ ప్రభుత్వంలోని లా డిపార్ట్‌మెంట్ ఏ విధమైన నిబంధనలు లేనట్లయితే, లైసెన్సీ మినహా మధ్యవర్తి ద్వారా మద్యం హోమ్ డెలివరీ చేయడం అనుమతించబడదని సూచించింది.