PM Modi : రావత్ మరణం ప్రతి దేశభక్తుడికీ లోటే..దేశాన్ని మరింత శక్తిమంతం చేస్తాం

 సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత దేశంలోని త్రివిధ దళాలను స్వయం సమృద్ధం చేయడం కోసం జనరల్ బిపిన్ రావత్ విశేషంగా

PM Modi : రావత్ మరణం ప్రతి దేశభక్తుడికీ లోటే..దేశాన్ని మరింత శక్తిమంతం చేస్తాం

Pm Modi

PM Modi : సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణం ప్రతి ఒక్క దేశభక్తుడికీ తీరని లోటు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత దేశంలోని త్రివిధ దళాలను స్వయం సమృద్ధం చేయడం కోసం జనరల్ బిపిన్ రావత్ విశేషంగా కృషి చేశారని చెప్పారు. ఈ కృషిని కొనసాగిస్తామని మోదీ అన్నారు.

ఉత్తర్​ప్రదేశ్ బలరాంపుర్​లో నిర్మించిన సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టును శనివారం ప్రారంభించిన మోదీ… అక్కడి బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ…దేశ సైన్యం స్వయం సమృద్ధి సాధించే దిశగా జనరల్ రావత్ నిరంతరం కృషి చేశారు. సైనికుడు మిలిటరీలో ఉన్నంతవరకే సైనికుడు కాదు. వారి జీవితాంతం వారు యోధులుగానే ఉంటారు. జనరల్ బిపిన్ రావత్ ఎక్కడున్నా..భారత్ సమున్నత శిఖరాలకు చేరడాన్ని చూస్తూనే ఉంటారు. భారత్​ను మరింత శక్తిమంతంగా తయారు చేస్తాం. దేశాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దుతాం”అని అన్నారు.

భారత దేశం విచారంలో ఉన్నప్పటికీ, వేగాన్ని, అభివృద్ధిని ఆపేది లేదని చెప్పారు. భారతీయులమంతా కలిసికట్టుగా పని చేస్తామని, దేశంలోపల, వెలుపల ఎదురయ్యే ప్రతి సవాలును ఎదుర్కొంటామని తెలిపారు.

ఇక,తమిళనాడు బుధవారం జరిగిన ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ని కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారని మోదీ తెలిపారు. ఆయన కుటుంబానికి దేశం అండగా ఉంటుందని చెప్పారు.

ALSO READ PM vs Akhilesh : స‌ర‌యూ కెనాల్ ప్రాజెక్టుపై మోదీ-అఖిలేష్ విమర్శల బాణాలు