Artificial Intelligence : కృత్రిమ మేధ తో ఊపిరితిత్తుల కేన్సర్ గుర్తింపు
రక్తనమూనాలను డీఏన్ఏ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రాగ్మెంట్స్ ఫర్ ఎర్లీ ఇంటర్సెషన్స్ విధానం ద్వారా పరీక్షించి అందులోని కేన్సర్ కణాల డీ ఎన్ ఏ అవశేషాలను గుర్తిస్తారు.

Cancer
Artificial Intelligence : ఊపిరితిత్తుల క్యాన్సర్ గుర్తించే అధునాతన విధానాన్ని శాస్త్ర వేత్తలు అభివృద్ధి చేశారు. జాన్స్ హాష్కిన్స్ కిమ్మెల్ కేన్సర్ సెంటర్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. కృత్రిమ మేధ సాయంతో రక్తనమూనాలను విశ్లేషించటం ద్వారా ఊపిరితిత్తుల కేన్సర్ ను గుర్తించవచ్చు. ఈ విశ్లేషణ ద్వారా తొలిదశలోనే కేన్సర్ ను గుర్తించటం సాధ్యమౌతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ వివరాలన్నీ నేచర్ జర్నల్ కమ్యునికేషన్స్ లో ప్రచురితమయ్యాయి.
రక్తనమూనాలను డీఏన్ఏ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రాగ్మెంట్స్ ఫర్ ఎర్లీ ఇంటర్సెషన్స్ విధానం ద్వారా పరీక్షించి అందులోని కేన్సర్ కణాల డీ ఎన్ ఏ అవశేషాలను గుర్తిస్తారు. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుంది. అమెరికా , డెన్మార్క్, నెదర్లాండ్స్ కు చెందిన 796 మందిపై పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఈ ప్రయోగలో పాల్గొన్నారు.
డెల్పీ విధానంలో అందరి రక్తనమూనాలను విశ్లేషణ చేసిన శాస్త్రవేత్తలకు 90 శాతం ఖచ్చితత్వంతో కూడిన ఫలితాలు వచ్చాయి. ఊపిరితిత్తుల కేన్సర్ మహమ్మారి కారణంగా ఏడాదికి 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు ఈ జబ్బును గుర్తించేందుకు డోస్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేవారు. ఈ విధానంతో రానున్న రోజుల్లో సరైన సమయంలో కేన్సర్ ను గుర్తించి అందుకు తగిన వైద్యం అందించేందుకు వీలవుతుంది.