Omicron Threat Telangana : ఒమిక్రాన్‌ను ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిధ్దంగా ఉంది-శ్రీనివాసరావు

ఒమిక్రాన్ ను   ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం   సిద్ధంగా ఉందని... ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు చెప్పారు.

Omicron Threat Telangana : ఒమిక్రాన్‌ను ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిధ్దంగా ఉంది-శ్రీనివాసరావు

DH Srinivasa Rao

Omicron Threat Telangana : ఒమిక్రాన్ ను   ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం   సిద్ధంగా ఉందని… ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు చెప్పారు. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కొత్త వేరియంట్, ప్రభుత్వ సన్నద్ధత పై రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస రావు విలేకరులతో మాట్లాడుతూ ….ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ .. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండి గత రెండు రోజుల నుండి పరిస్థితులను పరిశీలిస్తోందని చెప్పారు.  రాష్ట్రంలో కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించ  లేదని, కేసులు నిలకడగానే ఉన్నాయని ఆయన చెప్పారు.

దేశంలో ఇంత వరకు కొత్త వేరియంట్ నమోదు కాలేదని…. కొత్త వేరియంట్  రాకుండానే అడ్డుకునేలా ఎయిర్ పోర్టులోనే స్క్రీనింగ్ పెంచడం జరిగిందని చెప్పారు. ఎయిర్ పోర్టులోనే ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేస్తున్నామని… అనుమానితులను 14 రోజుల పాటు హోమ్ క్వారెంటైన్ ఉండేలా చర్యలు తీసుకొని వారి ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తున్నామని ఆయన చెప్పారు.
Also Read : Love Cheating : ప్రేమ…పెళ్లి పేరుతో లొంగదీసుకుని …..
మూడో వేవ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో సిద్దంగా ఉందని… ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.  నాలుగైదు నెలలుగా రాష్ట్రంలో 100 నుండి 150 మధ్యనే కోవిడ్ కేసులు  నమోదు అవుతున్నాయని ఆయన వివరించారు. రాష్ట్రంలో 90 శాతం మందికి మొదటి డోసు, 45 శాతంమందికి రెండో డోసు వ్యాక్సిన్ ఇచ్చామన్నారు.

రెండో డోసు తీసుకోవాల్సిన  వ్యవధి గడిచినా  ఇంకా  25 లక్షల మంది  వ్యాక్సిన్ తీసుకోలేదని ఆయన చెప్పారు. కరోనా కేసులు తగ్గడంతో వ్యాక్సిన్ వేయించుకోవటం, కరోనా నిబంధనలు పాటించడంలో ప్రజలు కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్లు గమనించామని శ్రీనివాసరావు అన్నారు. ఏ వేరియంట్ అయినా ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉందని…. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం… రెండు డోసుల వ్యాక్సిన్ తప్పని సరిగా తీసుకోవాలని ఆయన సూచించారు.