Dhanush: సార్ టీజర్.. చదువును పంచుతున్న తిలక్!

తమిళ హీరో ధనుష్ తొలిసారి స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటిస్తుండగా, ఈ సిినిమాకు ‘సార్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. నేడు ధనుష్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం నుండి టీజర్‌ను రిలీజ్ చేసింది సార్ చిత్ర యూనిట్.

Dhanush: సార్ టీజర్.. చదువును పంచుతున్న తిలక్!

Dhanush Sir Teaser

Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ తొలిసారి తెలుగులో నటిస్తున్న సినిమా ‘సార్’. ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్‌గా ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక నేడు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ‘సార్’ చిత్రం నుండి టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Dhanush: సార్.. ఫుల్ బిజీ మాష్టారు!

ధనుష్ తొలిసారి స్ట్రెయిట్ తెలుగు మూవీతో వస్తుండటంతో టాలీవుడ్ వర్గాల్లో సార్ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దానికి తగ్గట్టుగానే ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతూ వస్తున్నాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ అద్భుతంగా కట్ చేశారు చిత్ర యూనిట్. ఈ టీజర్‌లోనే సినిమా కథ ఏమిటో మనకు చెప్పేసింది చిత్ర యూనిట్. కార్పొరేట్ విద్యా వ్యవస్థ నిరుపేదలకు చదువును ఎలా దూరం చేస్తుందనే అంశంపై ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Dhanush Movie: ఆ రోజే ‘సార్’ టీజర్ రిలీజ్.. ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్

‘‘జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్.. ఇదేరా ఇప్పుడు ట్రెండ్’’ అంటూ ప్రస్తుత విద్యా వ్యవస్థ గురించి ఒక్కమాటలో చెప్పేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ సినిమాను క్లాస్, మాస్ ప్రేక్షకులు మెచ్చేలా అన్ని అంశాలతో తెరకెక్కిస్తోంది సార్ చిత్ర యూనిట్. ఇక ‘బాల గంగాధర్ తిలక్’ అనే పవర్‌ఫుల్ పేరు హీరోకు ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెంచేశాడు ధనుష్. సరికొత్త మేకోవర్‌తో ధనుష్ లుక్ ఈ సినిమాలో అద్భుతంగా ఉండటంతో, మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ సక్సెస్ అందుకునేందుకు ఈ హీరో రెడీ అవుతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నాగవంశీ, సౌజన్యలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తున్న ఈ ‘సార్’ టీజర్‌ను మీరూ ఓసారి చూసేయండి.