Dhanush : రజినీకాంత్ బయోపిక్ లో ధనుష్

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్స్‌ ట్రెండ్‌ నడుస్తుంది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల జీవితాలని తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సమయంలో మీరు ఏ బయోపిక్ లో నటిస్తారు అని..........

Dhanush : రజినీకాంత్ బయోపిక్ లో ధనుష్

Dhanush

Dhanush :   తమిళ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో విజయాలు సాధిస్తున్నాడు. నేషనల్ అవార్డుని కూడా గెలుచుకున్నాడు. ఇక కోలీవుడ్ నుంచి బాలీవుడ్ కి అటుగా హాలీవుడ్ కి కూడా వెళ్ళిపోతున్నాడు ధనుష్. ఇప్పటికే ధనుష్ చేతిలో తెలుగు, తమిళ్, హిందీ, హాలీవుడ్ సినిమాలు అన్ని కలిపి దాదాపు 10 పైనే ఉన్నాయి.

తాజాగా అక్షయ్‌ కుమార్, ధనుష్, సారా అలీఖాన్‌ నటించిన బాలీవుడ్ మూవీ ‘ఆత్రంగి రే’ ఈ నెల 24న ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఈ కోలీవుడ్ హీరో. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ హిందీ షోలో పాల్గొన్న ధనుష్‌ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్స్‌ ట్రెండ్‌ నడుస్తుంది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల జీవితాలని తెరకెక్కిస్తున్నారు.

Balakrishna : మూడు నెలల్లో సినిమా తీసేద్దాం.. సుక్కు డైరెక్షన్ లో బాలయ్య

ఇలాంటి సమయంలో మీరు ఏ బయోపిక్ లో నటిస్తారు అని ఆ షో యాంకర్ ధనుష్ ని అడిగారు. ఈ ప్రశ్నకి ధనుష్ సమాధానం చెప్తూ.. ‘‘నాకు రజనీకాంత్, ఇళయరాజగార్లంటే ఎంతో ఇష్టం. ఎనలేని అభిమానం. అవకాశం వస్తే వారిద్దరి బయోపిక్స్‌లో నటించాలని ఉంది’’ అని తెలిపారు. రజినీకాంత్ కి ధనుష్ ఎలాగో అల్లుడు కాబట్టి భవిష్యత్తులో రజిని బయోపిక్ వస్తే మాత్రం ధనుష్ కచ్చితంగా నటించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక తెలుగులో కూడా శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రెండు సినిమాలు చేయబోతున్నాడు.