Virender sehwag: ధోనీ చేసిన పనికి రిటైర్మెంట్ ప్రకటిద్దామనుకున్న.. సచిన్ వల్ల అలా చేయాల్సి వచ్చింది.

టీమిండియా ఒకప్పటి డాషింగ్ ఓపెన్ వీరేందర్ సెహ్వాగ్ బ్యాటింగ్ కు దిగాడంటే బౌలర్లకు హడలెత్తాల్సిందే. ఎక్కువగా ఓపెనర్ గా బరిలోకి దిగిన సెహ్వాగ్ తనదైనశైలిలో బౌలర్ల పై విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించేవారు. ఇక సెహ్వాగ్ కు సచిన్ తోడైతే ఆ రోజు క్రికెట్ ప్రేమికులు పండుగ చేసుకొనేవారు. అప్పట్లో సచిన్, సెహ్వాగ్ జోడీ క్రిజ్ లో ఉన్నారంటే క్రికెట్ ప్రేమికులు టీవీలకు అతుక్కుపోయేవారు.

Virender sehwag: ధోనీ చేసిన పనికి రిటైర్మెంట్ ప్రకటిద్దామనుకున్న.. సచిన్ వల్ల అలా చేయాల్సి వచ్చింది.

Cricket

Virender sehwag: టీమిండియా ఒకప్పటి డాషింగ్ ఓపెన్ వీరేందర్ సెహ్వాగ్ బ్యాటింగ్ కు దిగాడంటే బౌలర్లకు హడలెత్తాల్సిందే. ఎక్కువగా ఓపెనర్ గా బరిలోకి దిగిన సెహ్వాగ్ తనదైనశైలిలో బౌలర్ల పై విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించేవారు. ఇక సెహ్వాగ్ కు సచిన్ తోడైతే ఆ రోజు క్రికెట్ ప్రేమికులు పండుగ చేసుకొనేవారు. అప్పట్లో సచిన్, సెహ్వాగ్ జోడీ క్రిజ్ లో ఉన్నారంటే క్రికెట్ ప్రేమికులు టీవీలకు అతుక్కుపోయేవారు. 2008 లో సెహ్వాగ్ ఫామ్ కోల్పోయి పరుగులు రాబట్టేందుకు ఇబ్బందులు పడ్డాడు. ఆ సంవత్సరం జరిగిన ట్రై సీరిస్ లో సెహ్వాగ్ మొదటి నాలుగు మ్యాచ్ లలో 6, 33, 11, 14 ఇలా వరుస మ్యాచ్ లలో తక్కువ పరుగులకే పెవిలియన్ దారి పట్టడంతో అప్పటి టీమిండియా కెప్టెన్ గా ఉన్న మహేందర్ సింగ్ ధోనీ సెహ్వాగ్ ను పక్కన పెట్టాలని చూడటం, ఈ క్రమంలో వారి మధ్య విబేధాలు తలెత్తినట్లు ప్రచారం జరిగింది.

IPL 2022 : Gujarat Titans : ఐపీఎల్ విజేత గుజరాత్ టైటాన్స్‌ను సత్కరించిన సీఎం భూపేంద్రభాయ్

2008లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తుదిజట్టు నుంచి సెహ్వాగ్ ను ధోనీ తొలగించినప్పుడు నిజంగానే ధోనీ, సెహ్వాగ్ ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరారని నిరూపితమైంది. ఈ సమయంలో సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. అప్పటి విషయాన్ని సెహ్వాగ్ తాజాగా ప్రస్తావించాడు. ఆ సమయంలో తాను రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమైన మాట వాస్తవమేనని తెలిపాడు. కానీ సచిన్ కారణంగా నా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. వన్డేల్లో పెద్దగా రాణించకపోయే సరికి ధోనీ నన్ను తుదిజట్టు నుంచి తప్పించడంతో వన్డే క్రికెట్ నుంచి వైదొలగాలని అనుకున్నానని, టెస్టు క్రికెట్ లో మాత్రమే ఆడాలని అనుకున్నట్లు సెహ్వాగ్ తెలిపారు.

IPL Final 2022: ఫైనల్ మ్యాచ్‌లో కోపంతో ఊగిపోయిన బట్లర్.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్

నా నిర్ణయాన్ని ముందుగా సచిన్ కు తెలియజేశానని, అయితే సచిన్ నన్ను అడ్డుకున్నట్లు సెహ్వాగ్ తెలిపాడు. ఇది నీ జీవితంలో ఓ చెడు దశ, వెయిట్ చెయ్, ఈ పర్యటన తర్వాత ఇంటికెళ్లి ఏం చేయాలో బాగా ఆలోచించు, ఆ తర్వాతే నిర్ణయం తీసుకో అని సచిన్ సూచించాడని, దీంతో తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని సెహ్వాగ్ తెలిపాడు. ఈ క్రమంలో కోహ్లీపై సెహ్వాగ్ ప్రశంసలు కురిపించారు. సవాళ్లను ఇష్టపడే వాళ్లు విమర్శల్ని ఎంజాయ్ చేస్తారని, మైదానంలో పరుగుల ద్వారా వాటిని తిప్పికొడతారని, అందులో కోహ్లీని ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటూ సెహ్వాగ్ ప్రసంశించారు.