Dil Raju : ఒకప్పుడు బలవంతపు పెళ్లి అన్న దిల్ రాజు ఇప్పుడు ప్రేమ పెళ్లి అంటున్నాడు..

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం 'వరిసు'. పండగ కానుకగా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నిర్మాత తన లవ్ స్టోరీ గురించి మాట్లాడాడు.

Dil Raju : ఒకప్పుడు బలవంతపు పెళ్లి అన్న దిల్ రాజు ఇప్పుడు ప్రేమ పెళ్లి అంటున్నాడు..

Dil Raju told his love story

Dil Raju : ఇండస్ట్రీలో ఒక డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి నేడు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ ప్రొడ్యూసర్ అనిపించుకుంటున్న నిర్మాత దిల్ రాజు. సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉండడంతో ఎన్నో మంచి సినిమాలను ఇండస్ట్రీకి అందించాడు. దీంతో దిల్ రాజు నిర్మాణంలో సినిమా అంటే.. తప్పకుండా బాగుండి తీరుతుంది అనే ఒక నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ఈ నిర్మాత నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘వరిసు’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ నటించిన ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’ టైటిల్ తో రిలీజ్ అయ్యింది. పండగ కానుకగా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.

Dil Raju : సొంత థియేటర్‌ని ప్రారంభించిన దిల్‌రాజు.. SVC సినిమాస్..

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నిర్మాత తన లవ్ స్టోరీ గురించి మాట్లాడాడు. 2020 లో దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 47 వయసులో తేజస్విని అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా, ఇటీవలే ఒక బాబుకి కూడా జన్మనిచ్చింది తేజస్విని. కాగా తేజస్వినితో పరిచయం గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. ‘నా మొదటి భార్య చనిపోయినప్పుడు రెండేళ్ల పాటు ఫిసికల్ గా, మెంటల్ గా చాలా స్ట్రగుల్ అయ్యాను. జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే నన్ను అర్ధం చేసుకొనే ఒక వ్యక్తి ఉంటే బెటర్ అనిపించింది. లేకపోతే చాలా ఇబంధులు పడాల్సి వస్తుంది అని అర్ధం చేసుకున్నా.

ఆ సమయంలోనే నాకు తేజస్విని పరిచయం అయ్యింది. ఆమె ఫోన్ నెంబర్ తీసుకోని సంవత్సరం పాటు ఆమెను అబ్జర్వ్ చేశా. ఆమెను పూర్తిగా అర్ధం చేసుకున్నా తరువాత నేనే మొదటిగా ప్రపోజ్ చేశా. ఆ తరువాత ఫ్యామిలీని ఒప్పించి పెళ్లి చేసుకున్నా. నన్ను చాలా మంది ఆటిట్యూడ్ పర్సన్ అనుకుంటారు. ఈ క్రమంలోనే ప్రభాస్, వి వి వినాయక్ కూడా అనుకున్నారు. కానీ నాతో వర్క్ చేసిన తరువాత అది తప్పు అని వారికే అర్థమైంది. వారి లాగానే నా భార్య తేజస్విని కూడా అనుకుంది’ అంటూ తన లవ్ స్టోరీని తెలియజేశాడు. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో తన కూతురు, తల్లిదండ్రుల బలవంతం మీద రెండో వివాహం చేసుకున్నాను అంటూ వెల్లడించిన దిల్ రాజు.. ఇప్పుడు ప్రేమ పెళ్లి అనడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత 2017 లో హార్ట్ ఎటాక్ తో చనిపోయింది. వీరిద్దరికి ఒక అమ్మాయి కూడా ఉంది.