Coffee Benefits : కాఫీతో చర్మ సౌందర్యం..నిగనిగలాడే ఒతైన కురులు మీ సొంతం

మనం రోజు తాగే కాఫీతో మన చర్మానికి, జుట్టుకుని ఎన్నో ప్రయోజనాలున్నాయి. కాపీ తాగినా..కాఫీ పొడిని ప్యాక్ లా వేసుుకున్నా..నిగారించే చర్మం సౌందర్యంతో పాటు నల్లని ఒత్తైన జుట్టు మీ సొంతమవుతుంది.

Coffee Benefits : కాఫీతో చర్మ సౌందర్యం..నిగనిగలాడే ఒతైన కురులు మీ సొంతం

Coffice Hair And Face

Coffee Can Do Wonders To Your Skin And Hair : ఉదయం లేవగానే ఓ కప్పు కాఫీ పడకపోతే ఏ పని ముందుకెళ్లదు. వేడి వేడిగో పొగలు కక్కే ఓ కప్పు కాఫీ తాగితే పనుల్నీ చకచకా అయిపోతాయి.కానీ కాఫీ కేవలం తాగటానికే కాదు కాఫీ పొడితో చర్మానికి, జుట్టుకు ఎంత మేలు చేస్తుందో..ఎంత అందంగా చేస్తుందో తెలిస్తే తప్పకుండా ట్రై చేసి తీరుతారు. కాఫీ పొడితే ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖారవిందం చక్కగా మెరిసిపోతుంది. ముఖంలో చక్కటి గ్లో వస్తుంది. అలాగే జుట్టుకు కూడా చక్కటి నిగారింపు వస్తుంది.పట్టులాంటి జుట్టు మీ సొంతమవుతుంది. మరి కాఫీ పొడిని చర్మానికి జుట్టుకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

యాంటీ-ఆక్సిడెంట్స్‌‌తో అందం..
బయటకు అడుగు పెడితే చాలు పొల్యూషన్.దీంతో ముఖానికి జుట్టు పేలవంగా మారిపోతుంది. పొల్యూషన్ కి స్కిన్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. కాఫీ పొడిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్ కారణంగా కాఫీ ప్రోడక్ట్స్ స్కిన్ ని కాపాడుతాయి. అంతేకాదు..కెఫిన్ లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్ సూర్య కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.అల్ట్రా వయొలెట్ రేస్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్కిన్ కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు కూడా రావచ్చు. అయితే, కెఫీన్ స్కిన్ ని ఈ యూవీ రేస్ నించి రక్షిస్తుంది.

యాంటీఆక్సిడెంట్లు మీ చర్మం, జుట్టుకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. మీరు కాఫీ తాగినా లేదా మాస్క్ లా ఉపయోగించినా, అది మీ చర్మాన్ని జుట్టును కాలుష్యం నుంచి, రరసాయనాలు వంటివాటి నుంచి కాపాడుతుంది. అలాగే ఉపశమనం కలిగించే, ప్రశాంతతనిస్తుంది. కెఫీన్ టిష్యూ రిపేర్ కి సహకరిస్తుంది. అందువల్ల సెల్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ కూడా స్మూత్ గా మంచి గ్లో తో ఉంటుంది. కాఫీ బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. దీంతో స్కిన్ కూడా హెల్దీ గా ఉంచుతుంది. బ్లడ్ సర్య్కులేషన్ సక్రమంచేసి చర్మం ఎక్కడన్నా ఉబ్బినట్టుగా ముఖ్యంగా కళ్లకింద (క్యారీబ్యాగులు) ఉన్నా వాటిని తగ్గిస్తుంది.
అంతేకాదు కాదు కాఫీలో ఉండే కెఫిన్ హైపర్‌పిగ్మెంటేషన్ వల్ల వచ్చే ముడతల్ని, మచ్చలు రాకుండా చేస్తుంది. వృద్ధాప్య లక్షణాలను నియంత్రిస్తుంది. ఇది తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. కెఫిన్ కాకుండా, కాఫీలో పాలీఫెనాల్స్ కూడా ఉన్నాయి, ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌లుగా పనిచేసి చర్మ సౌందర్యానికి..నిగనిగలాడే జుట్టుగా మారటానికి ఉపయోపడుతుంది. కాఫీలోని CGA,విటమిన్ B3 వాపుల నుండి కాపాడతాయి.కొల్లాజెన్ పెరుగుదలను పెంచుతాయి.

కాఫీ అనేది ప్రభావవంతమైన ఎక్స్‌ఫోలియంట్ అని చెప్పాల్సిందే. ఇది మీ చర్మం పైన ఉండే మృత కణాలను తొలగిస్తుంది. కొత్త చర్మ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో మీ చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపును సంతరించుకుని నిగనిగలాడుతుంది. ఒక కాఫీ స్క్రబ్ మోటిమలు కలిగించే సూక్ష్మక్రిములతో పోరాడుతుంది. సూర్యుడు నుంచి వచ్చే UV కిరణాల హానికరమైన ప్రభావాల నుండి కాఫీ కాపాడుతుంది. రోజు కాఫీని తాగటం వల్ల చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పరిశోధనలో తేలింది.అంతేకాదు..

జుట్టు కోసం కాఫీ..

మీ జుట్టును దృఢంగా మరియు అందంగా చేసుకోవటానికి కాఫీ చాలా చాలా ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచటంతో కాఫీ జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాదు..జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇది జుట్టు కుదుళ్లను గట్టిపరుస్తుంది. దీంతో అందమైన జుట్టు పెరుగుదలను ఉపయోగకరంగా మారుతుంది. కాఫీలో ఉండే కెఫిన్ DHT (డైహైడ్రోటెస్టోస్టెరాన్) అనే హార్మోన్ యొక్క ప్రభావాలను తిప్పికొడుతుంది. కాబట్టి మీరు కాఫీ తాగినా లేదా మీ హెయిర్ మాస్క్‌కు జోడించినా, మీ జుట్టుకు కాఫీ చాలా మంచిది. జుట్టు రంగు కోసం కాఫీ మీ జుట్టు రంగును పెంచటంలో చక్కగా పనిచేస్తుంది. కాఫీ మీ జుట్టును నల్లగా,కాంతివంతంగా మారుస్తుంది. ఇది సహజమైనది కాబట్టి ఏ సైడ్ ఎఫెక్టులు ఉండవు. కాఫీతో పాటు చక్కెర మరియు పాలు తీసుకుంటే, అది మొటిమలు వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది. అందువలన, మెరిసే చర్మం మరియు అందమైన జుట్టు కోసం దీనిని తెలివిగా ఉపయోగించండి.