Shiva Kartikeyan : ‘ఆర్ఆర్ఆర్’ కోసం తమిళ్ స్టార్ హీరో సినిమా వాయిదా.. స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన టీమ్

తాజాగా తమిళ్ లో 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ రోజు మరో స్టార్ హీరో సినిమా ఉంటే దాన్ని వాయిదా వేసుకున్నారు. ‘రెమో’, ‘డాక్టర్‌’.. లాంటి పలు సినిమాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్ సాధించిన హీరో..

Shiva Kartikeyan : ‘ఆర్ఆర్ఆర్’ కోసం తమిళ్ స్టార్ హీరో సినిమా వాయిదా.. స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన టీమ్

Rrr

RRR :  కరోనా కారణంగా చాలా సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అలా వాయిదా పడే సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్’ ముందు వరసలో ఉంటుంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు. దాంతో చాలా సినిమాలు పండగ పోటీ నుండి తప్పుకున్నాయి. కాని చివరి నిమిషంలో కరోనా కారణంగా వాయిదా వేసుకోవడంతో ఒక్కసారిగా చిన్న సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి.

అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పాన్ ఇండియా వైడ్ అన్ని భాషల్లో రిలీజులని చూసుకొని ప్లాన్ చేసుకుంటుంది. తాజగా ఈ సినిమాని మార్చ్ 25న దేశ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్ర యూనిట్. ఇందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. త్వరలో మళ్ళీ ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. దీంతో ఆ డేట్ లో ఉండే సినిమాలు వాయిదా వేసుకుంటున్నాయి. తెలుగులో అయితే ఆ సినిమా రిలీజ్ డేట్ రోజు వేరే సినిమాలు రిలీజ్ కి ధైర్యం చేయవు. తాజాగా తమిళ్ లో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ రోజు మరో స్టార్ హీరో సినిమా ఉంటే దాన్ని వాయిదా వేసుకున్నారు.

Dulquer Salman : హే సినామిక ప్రీ రిలీజ్ ఈవెంట్

‘రెమో’, ‘డాక్టర్‌’.. లాంటి పలు సినిమాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్ సాధించిన హీరో శివకార్తికేయన్‌. ప్రస్తుతం శివ కార్తికేయన్ ‘డాన్’ సినిమాతో రాబోతున్నారు. డాన్ సినిమాని కూడా మార్చి 25న విడుదల చేయాలని అనుకున్నారు. కాని ఇంతలో మార్చి 25న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో ఈ సినిమాని వాయిదా వేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో.. ”ఆర్‌ఆర్‌ఆర్‌ ని దృష్టిలో ఉంచుకుని ‘డాన్‌’ రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ చేస్తున్నామని” తెలిపారు.

Gangubai Kathiawadi: ‘గంగూబాయి కతియవాడి’కి నో చెప్పిన హీరోయిన్స్ వీళ్ళే..

‘డాన్’ సినిమాని మే 13న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ శివకార్తికేయన్‌కు ధన్యవాదాలు చెబుతూ పోస్ట్ పెట్టింది. ‘‘మాపై ఎప్పుడూ ప్రేమాభిమానాలు చూపించే వ్యక్తుల్లో మొట్టమొదట ఉండే శివకార్తికేయన్‌కు ధన్యవాదాలు’’ అని ట్వీట్‌ చేసింది. తమిళ ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి శివ కార్తికేయన్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి మార్చ్ 25 దేశమంతటా ‘ఆర్ఆర్ఆర్’ పేరు మోత మోగబోతుంది.