Gangubai Kathiawadi: ‘గంగూబాయి కతియవాడి’కి నో చెప్పిన హీరోయిన్స్ వీళ్ళే..

'గంగూబాయి కతియవాడి' సినిమాకి అలియా భట్ కంటే ముందు ముగ్గురు హీరోయిన్స్ ని అనుకున్నారట. కాని వాళ్ళు ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పకపోవడంతో ఈ ఛాన్స్ అలియాకి వచ్చింది. ఇంతకీ ఆ ముగ్గురు......

Gangubai Kathiawadi: ‘గంగూబాయి కతియవాడి’కి నో చెప్పిన హీరోయిన్స్ వీళ్ళే..

Gangubhai

 

Gangubai Kathiawadi :  అలియాభట్ మెయిన్ లీడ్ గా చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘గంగూబాయి కతియవాడి’. గంగూబాయి అనే ఓ మాఫియా క్వీన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ తెరకెక్కించారు. ఇటీవల ఫిబ్రవరి 25న ఈ సినిమా రిలీజ్ అయింది. సౌత్ లో ‘గంగూబాయి కతియవాడి’ ప్రభావం పెద్దగా లేకపోయినా బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో అలియా నటనకి విమర్శకులు సైతం ప్రశంశలు కురిపిస్తున్నారు. ‘గంగూబాయి కతియవాడి’ సినిమాతో అలియా నటనలో మరో స్టేజికి వెళ్లిపోయిందని సినీ అభిమానులు అంటున్నారు.

అయితే ‘గంగూబాయి కతియవాడి’ సినిమాకి అలియా భట్ కంటే ముందు ముగ్గురు హీరోయిన్స్ ని అనుకున్నారట. కాని వాళ్ళు  ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పకపోవడంతో ఈ ఛాన్స్ అలియాకి వచ్చింది. ఇంతకీ ఆ ముగ్గురు హీరోయిన్స్ ఎవరంటే…

‘గంగూబాయి కతియవాడి’ సినిమాని ముందు దీపికా పదుకొనెతో తీద్దాం అనుకున్నారట. అయితే ఈ సినిమా దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీతో కలిసి దీపికా గతంలో ‘రామ్‌లీలా’, ‘పద్మావత్‌’, ‘బాజీరావ్‌ మస్తానీ’ సినిమాల్లో నటించింది. ఇవన్నీ మంచి విజయాలు సాధించాయి. దీపికా ప్రస్తుతం వేరే ప్రాజెక్టులలో ఉండటం, ఇప్పటికే ఈ డైరెక్టర్ తో మూడు ప్రాజెక్టులు చేయడంతో ఈ సినిమాకి నో చెప్పింది దీపిక.

Deepika

Kamal Haasan : ముగ్గురు స్టార్ హీరోల మల్టీస్టారర్.. 150 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్..

ఆ తర్వాత ప్రియాంకచోప్రాని కూడా అనుకున్నారట. అయితే ఈ సినిమా గురించి ప్రియంకని ఓ మీడియా ఛానెల్‌ ఇంటర్వ్యూలో ఈ స్టోరీకి మిమ్మల్ని అనుకుంటున్నారట అని అడుగగా.. ప్రియాంక మాట్లాడుతూ.. ”నా దగ్గరికి ఎవరు ఆ స్టోరీతో రాలేదు. అయినా నేను ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాను. హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నాను కాబట్టి ఎలాంటి హిందీ సినిమాలను ప్రస్తుతం అంగీకరించలేను” అని తెలిపింది. దీంతో కనీసం ఈ స్టోరీని ప్రియాంకకి చెప్పకుండానే డ్రాప్ అయ్యారంట దర్శక నిర్మాతలు.

Priyanka

Varun Tej : ‘గని’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే

చివరగా ఈ సినిమాకి రాణి ముఖర్జీని హీరోయిన్ గా అనుకున్నారట. రాణి గతంలో సంజయ్ లీలా సినిమాల్లో నటించింది కూడా. కాని తన పర్సనల్ కారణాల వల్ల రాణి ఈ సినిమా చేయను అని చెప్పిందట. దీంతో చివరగా ఈ సినిమా ఆలియా భట్ దగ్గరికి రావడంతో వచ్చిందే ఛాన్స్ అనుకోని లేడీ ఓరియెంటెడ్ సినిమాలో గంగూబాయిగా అదరగొట్టేసింది. మొత్తానికి కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గానే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయగలనని అలియా నిరూపించింది. దీంతో అలియాకి మరిన్ని లేడీ ఓరియెంటెడ్ పాత్రలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Rani Mukharjee