Rohit Sharma: కోహ్లీ ఫామ్ గురించి మాట్లాడాలంటే ఇది గుర్తుపెట్టుకోండి – రోహిత్ శర్మ

కొంతకాలంగా అభిమానులను నిరాశపరిచిన విరాట్ కోహ్లీ.. తాజాగా ముగిసిన ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లో సత్తా చూపిస్తాడనుకుంటే పేలవంగా ముగించాడు. టీమ్ ప్లేయర్లతో పాటు అభిమానులను నిరాశపరిచాడు.

Rohit Sharma: కోహ్లీ ఫామ్ గురించి మాట్లాడాలంటే ఇది గుర్తుపెట్టుకోండి – రోహిత్ శర్మ

Rohit Sharma (1)

Rohit Sharma: కొంతకాలంగా అభిమానులను నిరాశపరిచిన విరాట్ కోహ్లీ.. తాజాగా ముగిసిన ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లో సత్తా చూపిస్తాడనుకుంటే పేలవంగా ముగించాడు. టీమ్ ప్లేయర్లతో పాటు అభిమానులను నిరాశపరిచాడు. మూడో మ్యాచ్‌లో 4, 6 బాది ఫామ్‌లోకి వచ్చాడనుకునేలోపే తర్వాతి బంతికి అవుట్ అయిపోయాడు.

ఇలా రెండు మ్యాచ్‌లలో కలిపి మొత్తం చేసిన స్కోరు 12పరుగులే కావడం నిరుత్సాహపరిచింది. విరాట్ కోహ్లీ ఆట తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలో.. చాలామంది సీనియర్లు విశ్రాంతి తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కూడా జట్టు నుంచి తప్పించడమే బెటర్ అని సూచించాడు.

కోహ్లీ ప్రస్తుత ఫామ్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెస్పాండ్ అయ్యాడు. ప్రతి ఆటగాడు ఏదో ఒక సమయంలో ఫామ్‌  కోల్పోవడం.. తిరిగి పొందడం లాంటివి ఉంటాయని, కోహ్లీ కూడా ఫామ్‌లోకి వస్తాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆటగాడి నాణ్యత ఎప్పుడూ తగ్గదని కోహ్లీ ఫామ్‌కి సంబంధించి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని రోహిత్ సూచించాడు.

Read Also : టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ రికార్డ్.. తొలి ఇండియన్ క్రికెటర్

తాను కూడా ఓ దశలో ఫామ్ కోల్పోయానని గుర్తు చేశాడు. బయటివారు చేసిన విమర్శలను పట్టించుకోమని చెప్పాడు. అసలు నిపుణులు ఎవరో.. వారిని ఎందుకు అలా పిలుస్తున్నారో అర్థం కావడం లేదని సెటైర్ వేశాడు. బయట నుంచి విమర్శలు చేస్తున్నారని.. టీమిండియాలో జరుగుతున్నదేంటో వారికి తెలియదని బదులిచ్చాడు.

తామంతా కలిసి వరల్డ్ కప్‌ లక్ష్యంగా జట్టును తయారు చేసుకుంటున్నామని..యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నామని చెప్పాడు. ఈ విషయాలన్నీ బయట వారికి తెలియాల్సిన అవసర్లేదని రోహిత్ సమాధానమిచ్చాడు.