CM Mamata Banerjee :‘మీ భార్యని అప్పుగా ఇవ్వొద్దు..ఇస్తే తిరిగి రాదు’ అంటూ..నోరు జారిన దీదీ..ఏకిపారేస్తున్న ప్రత్యర్థులు

‘మీ భార్యను ఎవ్వరికి అప్పుగా ఇవ్వొద్దు..ఇస్తే తిరిగి రాదు’ అంటూ..మరోసారి నోరు జారారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు సంధిస్తున్నారు ప్రత్యర్థులు.

CM Mamata Banerjee :‘మీ భార్యని అప్పుగా ఇవ్వొద్దు..ఇస్తే తిరిగి రాదు’ అంటూ..నోరు జారిన దీదీ..ఏకిపారేస్తున్న ప్రత్యర్థులు

Don't Lend House Wife To Anyone.. If Given..no Refund Cm Mamata

Don’t lend House wife to anyone..CM Mamata Banerjee :ఎదుటివారు ఎంతటివారైనా సరే సూటిగా మాట్లాడే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి నోరు జారారు. రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో దీదీ మాట్లాడుతూ..‘‘ మీ జ్ఞానం, మేధస్సు, భార్యని (హౌస్ వైఫ్) ఎవ్వరికి అప్పుగా ఇవ్వకండి.. ఇస్తే తిరిగి మీ చేతికి రాదు’’అంటూ ఆమె కామెంట్ చేశారు. ఈ మాటల్నీ దీదీ జోక్‌గానే అన్నారు. కానీ ఈ వ్యాఖ్యలు ఆమెకు తలనొప్పిని తెచ్చిపెట్టాయి. దీదీ చేసిన ఈ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ప్రత్యర్ధులు దీదీని ఏకిపారేస్తున్నారు. 10 ఏళ్ల క్రితం కూడా దీదీ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఓ ఇంగ్లీష్ జోక్ ను సరదా చెప్పబోయి వివాదంలో చిక్కుకున్నారు ఇప్పుడు కూడా అదే జరింగింది.

ఎదుటి వారికి ఏదైనా విషయాన్ని సూటిగా.. సుత్తిలేకుండా చెప్పాలంటే సామెతలు ఎంతో ఉపయోగపడుతాయి. కానీ కొన్నిసార్లు అవే సామెతలు తలనొప్పులు కూడా తెచ్చి పెడతాయి. ఎందుకంటే సామెతల ఎప్పుడు చాలా షార్ప్ గా ఉంటాయి. ఆ షార్పే మనకు బూమరాంగ్ అవుతుంది. అందుకే సామెతల వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉపయోగించాలి. దీదీ విషయంలో 10ఏళ్ల క్రితం జరిగిందే మరోసారి అదే జరిగింది.

పదేళ్ల క్రితం ఓ బుక్ ఫెయిర్‌లో పాల్గొన్న మమతా బెనర్జీ రిలేటడ్ గా ఉందని పుస్తకం రిలేటడ్ గా ఉంటుందని అనుకున్నారో ఏమోగానీ దీదీ నోరు జారీ ఓ ఘాటు ఇంగ్లీషు సామెత వాడారు. ‘పుస్తకం, భార్యను ఇతరులకు అప్పుగా ఇవ్వకూడదని.. ఇస్తే కనుక అది తిరిగి రాదంటూ ఆంగ్ల సామెతను ప్రస్తావించారు. జోక్‌గా ఆమె చేసిన ఈ కామెంట్స్‌పై తీవ్ర రాజకీయ విమర్శలు వచ్చాయి. పదేళ్లు గడిచాక.. ఇప్పుడు మరోసారి మమతా బెనర్జీ చేసిన అదే రకమైన కామెంట్స్‌ మళ్లీ వివాదాన్ని రేపాయి.హౌస్ వైఫ్ గురించి మమతా బెనర్జీ వాడిన భాష సరిగ్గా లేదంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

విద్యా స్కాలర్‌షిప్‌లకు ఇవ్వాల్సిన నిధులను కేంద్రం సరిగ్గా ఇవ్వడం లేదని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా.. మేధస్సు చాలా ముఖ్యమైంది కాబట్టి ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలోనే విద్య, మేధస్సు, హౌస్ వైఫ్‌ను ఇతరులకు ఇవ్వకండి అంటూ..అనేశారు.దీంతో వివాదంలో చిక్కుకున్నారు దీదీ. మహిళలను కించపరిచేలా మమతా బెనర్జీ కామెంట్స్ ఉన్నాయంటూ రాజకీయ ప్రత్యర్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ అభ్యంతరకరమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని..మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ డిమాండ్స్ ను అధికార తృణముల్ కాంగ్రెస్(TMC) నేతలు ఖండిస్తున్నారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలను తప్పుబట్టాల్సిన అవసరం లేదని..సామెతల విషయంలో ఇలా తప్పుబడితే.. ఏ సామెతనూ ఎవ్వరు ఎక్కడా ఏ సందర్భంలోనే వాడలేరని సర్థి చెబుతున్నారు. సామెతలను సామెతలుగానే చూడాలని.. దీనిలో ద్వంద్వ అర్థాలు వెతక్కూడదంటూ సూచిస్తున్నారు.

ఆమె కూడా ఓ మహిళే..దీదీకి మహిళలపై ఎంతో గౌరవం ఉందని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదని ఆమె మహిళలకు స్ఫూర్తిదాయకమైన మహిళ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ వివాదానికి స్వస్తి పలకాలని..గతంలో రాజకీయాల్లో ఇలాంటి అనవసర అంశాలపై వివాదాలు ఉండేవి కావని.. ఇప్పుడు దీదీ ఏది మాట్లాడినా ప్రతిపక్షాలు దాన్ని వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు.