drones deliver medicines: గ్రామాలకు డ్రోన్లతో మందుల సరఫరా.. సత్ఫలితాలిచ్చిన ట్రయల్స్

త్వరలో దేశంలో డ్రోన్లతో ఔషధాల సరఫరా జరగనుంది. ముఖ్యంగా వైద్య సేవలు సరిగ్గా అందని గ్రామీణ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేయవచ్చని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)’ అభిప్రాయపడింది.

drones deliver medicines: గ్రామాలకు డ్రోన్లతో మందుల సరఫరా.. సత్ఫలితాలిచ్చిన ట్రయల్స్

Drones Deliver Medicines

Updated On : May 20, 2022 / 8:19 PM IST

drones deliver medicines: త్వరలో దేశంలో డ్రోన్లతో ఔషధాల సరఫరా జరగనుంది. ముఖ్యంగా వైద్య సేవలు సరిగ్గా అందని గ్రామీణ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేయవచ్చని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)’ అభిప్రాయపడింది. తెలంగాణలో 45 రోజులపాటు నిర్వహించిన ట్రయల్స్ సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం, అపోలో హాస్పిటల్స్, నీతి ఆయోగ్ కలిసి 45 రోజులపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ప్రయోగాత్మకంగా డ్రోన్లతో మందులు సరఫరా చేశారు. ‘మెడిసిన్ ఫ్రమ్ ద స్కై’ పేరుతో ఈ ప్రాజెక్టు నిర్వహించారు. కోవిడ్ వ్యాక్సిన్లు, టెస్టింగ్ శాంపిల్స్, ఇతర మెడికల్ సామగ్రిని వివిధ హెల్త్ కేర్ సెంటర్స్‌కు డ్రోన్లతో సరఫరా చేశారు.

FDI inflow: దేశంలోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ.. ఒక్క ఏడాదిలో ఎంతంటే

దీని ద్వారా మూడు లక్షల మందికి సేవలు అందాయి. ఇది ఆసియాలోనే పెద్ద ప్రయోగాత్మక ప్రాజెక్టు. దాదాపు 300 డ్రోన్లను దీనికోసం వినియోగించారు. 2021 డ్రోన్ రూల్స్ పాటిస్తూ ఇవి మందులను సరఫరా చేశాయి. ఈ ప్రయోగం సత్ఫలితం ఇచ్చింది. దీంతో త్వరలో పూర్తిస్థాయిలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.