presidential election: ఢిల్లీ చేరుకున్న ద్రౌప‌ది ముర్ము.. రేపు నామినేష‌న్ దాఖలు

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌లోని ఎమ్మెల్సీ గెస్ట్ హౌస్ నుంచి విమానంలో బ‌య‌లుదేరి ఢిల్లీ చేరుకున్నారు.

presidential election: ఢిల్లీ చేరుకున్న ద్రౌప‌ది ముర్ము.. రేపు నామినేష‌న్ దాఖలు

Droupadi Murmu

presidential election: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌లోని ఎమ్మెల్సీ గెస్ట్ హౌస్ నుంచి విమానంలో బ‌య‌లుదేరి ఢిల్లీ చేరుకున్నారు. ఆమె ప్రధాని మోదీని కలవనున్నారు. రాష్ట్రపతిగా అవకాశం కల్పించినందుకు ప్రధానికి ద్రౌప‌ది ముర్ము కృతజ్ఞతలు తెలుపుతారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో ద్రౌపది ముర్ము నామినేషన్ పేపర్లు సిద్ధ‌మవుతున్నాయి.

Presidential Election: ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరు వద్దంటారు?: విజయసాయిరెడ్డి

ఆమె రేపు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేష‌న్ వేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా బలపరుస్తూ నామినేషన్ పేపర్లపై బీజేపీ ఎంపీలు సంతకాలు చేస్తున్నారు. కాగా, విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ నెల 27న ఉద‌యం 11.30 గంట‌ల‌కు నామినేష‌న్ వేయ‌నున్నారు. రాష్ట్రప‌తి ఎన్నిక జూలై 18న జ‌ర‌గ‌నుంది. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు ఈ నెల‌ 29 చివ‌రి తేదీ. ఈ ఎన్నిక ఫ‌లితాలను జూలై 21న వెల్ల‌డిస్తారు.