President Droupadi Murmu : ‘ద్రౌపది’..నా అసలు పేరు కాదు! నా అసలు పేరు ఏంటంటే…!

President Droupadi Murmu : ‘ద్రౌపది’..నా అసలు పేరు కాదు! నా అసలు పేరు ఏంటంటే…!

President Droupadi Murmu

president Droupadi Murmu : భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేసి బాధ్యలను స్వీకరించారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ములో ద్రౌపది అనే పేరు తనకు ఎలా వచ్చిందో అనే విషయం తెలిపిన ఓ ఇంటర్వ్యూ మరోసారి ఆసక్తికరంగా మారింది. గతంలో ముర్ము ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అసలు పేరు ద్రౌపది కాదంటూ సంచలన విషయం తెలిపారు. సాధారణంగా ‘ద్రౌపది’అనేపేరు ఎవ్వరు పెట్టుకున్నట్లుగా ఎక్కడా వినలేదు. కానీ..బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును పేరు ప్రకటించాక ద్రౌపది ముర్ము పేరు దేశమంతా మారు మ్రోగిపోయింది. పైగా ఆమె ఆదివాసీ మహిళ కావటమే కాకుండా ‘ద్రౌపది’అనే పేరు ఆసక్తిగా మారింది. రాష్ట్రపతి పదవిని చేపట్టిన రెండో మహిళగాను..అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు ద్రౌపది ముర్ము తన అసలు పేరు ఏమిటో..ద్రౌపది అనే పేరు ఎవరు పెట్టారో అనే పలు ఆసక్తికర విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Also read : President Draupadi Murmu: నేను రాష్ట్రపతిగా ఎన్నిక కావటం ఆదివాసీల విజయం : ద్రౌపది ముర్ము

‘మహాభారతం’ లో ఐదుగురు భర్తలకు భార్య ‘ద్రౌపది’. బహుశా అందుకేనేమో ఆ పేరు ఎవ్వరికి ఉండదేమో. ఇదిలా ఉంటే..‘ద్రౌపదీ’ పేరు తనకు ఎలా వచ్చిందో వివరిస్తూ.. ద్రౌపది అనే పేరును తన స్కూల్‌ టీచర్‌ పెట్టారని వెల్లడించారు. కొంతకాలం క్రితం ముర్ము ఓ ఒడియా వీడియో మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించాక బయటకొచ్చాయి. అందులో ఆమె తన పేరుకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ‘‘ద్రౌపదీ నా అసలు పేరు కాదు. మా తల్లిదండ్రులు నాకు సంతాలీలో ‘పుటి’ అని పేరు పెట్టారు. స్కూల్లో చదువుతున్న సమయంలో మా టీచర్‌ ఒకరు ఈ పేరు అంతగా బాలేదని మార్చేశారు. ద్రౌపదీ అని పేరు పెట్టారు’’ అని ముర్ము తన చిన్ననాటి సంగతులను గుర్తుచేసుకున్నారు.

సంతాలీ సంప్రదాయంలో పేర్లు ఎప్పటికీ మారనని ద్రౌపదీ ముర్ము తెలిపారు. ఆడపిల్ల పుడితే బామ్మ పేరు, అబ్బాయి పుడితే తాత పేరు పెట్టడం తమ ఆనవాయితీ అని..అందుకే ఆ పేర్లు వస్తుంటాయని తెలిపారు. స్కూల్, కాలేజీలో తన పూర్తి పేరు ద్రౌపదీ తుడుగా ఉండేదని, పెళ్లయ్యాక ద్రౌపదీ ముర్ముగా మారిందని చెప్పుకొచ్చారు.