Ex-Apple employee : రూ. 140 కోట్లు కొట్టేసిన ఆపిల్‌ మాజీ ఉద్యోగి.. దోషిగా తేలితే 20ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం!

Ex-Apple employee : భారతీయ సంతతికి చెందిన ఆపిల్ మాజీ ఉద్యోగి ధీరేంద్ర ప్రసాద్ కంపెనీలో 20 మిలియన్ డాలర్లకుపైగా మోసానికి పాల్పడినట్టు నేరాన్ని అంగీకరించాడు. కుపర్టినో ఆధారిత కంపెనీ ఆపిల్‌తో 10 ఏళ్లకు పైగా అనుబంధం ఉన్న ధీరేంద్ర ప్రసాద్.. కంపెనీని మోసం చేసినందుకు 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించనున్నాడు.

Ex-Apple employee : రూ. 140 కోట్లు కొట్టేసిన ఆపిల్‌ మాజీ ఉద్యోగి.. దోషిగా తేలితే 20ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం!

Ex-Apple employee Dhirendra Prasad stole over Rs 140 crore from company, likely to get up to 20 years in jail

Ex-Apple employee : భారతీయ సంతతికి చెందిన ఆపిల్ మాజీ ఉద్యోగి ధీరేంద్ర ప్రసాద్ కంపెనీలో 20 మిలియన్ డాలర్లకుపైగా మోసానికి పాల్పడినట్టు నేరాన్ని అంగీకరించాడు. కుపర్టినో ఆధారిత కంపెనీ ఆపిల్‌తో 10 ఏళ్లకు పైగా అనుబంధం ఉన్న ధీరేంద్ర ప్రసాద్.. కంపెనీని మోసం చేసినందుకు 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించనున్నాడు. ప్రసాద్ కిక్‌బ్యాక్‌లు తీసుకోవడం, ఇన్‌వాయిస్‌లను పెంచడం, స్పేర్ పార్టులను దొంగిలించడంతో పాటు ఆపిల్ అందించని సర్వీసులకు కూడా డబ్బులు వసూలు చేయడం చేసినట్టు విచారణలో తేలింది. ఆపిల్ కంపెనీని మోసం చేసిన వ్యక్తుల్లో ప్రసాద్ మాత్రమే కాదు. అతనితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారు ఆపిల్ నుంచి డబ్బును దొంగలించడంలో చేతులు కలిపారు. రాతపూర్వక అభ్యర్ధన ఒప్పందంలో 52 ఏళ్ల ప్రసాద్ తాను 2008 నుంచి 2018 వరకు ఆపిల్‌తో కలిసి పనిచేశాడు.

Ex-Apple employee Dhirendra Prasad stole over Rs 140 crore from company, likely to get up to 20 years in jail

Ex-Apple employee Dhirendra Prasad stole over Rs 140 crore from company

ఆ సమయంలో ఎక్కువ కాలం Apple గ్లోబల్ సర్వీస్ సప్లై చైన్‌లో కొనుగోలుదారుగా పనిచేశానని వెల్లడించాడు. Apple నుంచి స్పేర్ పార్టులు, సర్వీసులను కొనుగోలు చేయడంలో ప్రసాద్ కీలకంగా వ్యవహరించాడు. 2011 నుంచి కంపెనీని మోసం చేయడం ప్రారంభించినట్టు ప్రసాద్ వెల్లడించాడు. 2018 వరకు కంపెనీని మోసం చేస్తూనే వచ్చాడు. అదే సంవత్సరంలో, ఆపిల్ దాదాపు 17 మిలియన్ డాలర్లను కోల్పోయింది. ఆపిల్‌కు 17 మిలియన్‌ డాలర్లు (రూ. 140 కోట్లు) దోచుకున్న వ్యక్తుల్లో ధీరేందర్‌ ఒక్కరే కాదు. అతనికి రాబర్ట్ గ్యారీ హాన్సెన్, డాన్ ఎం. బేకర్ అనే మరో ఇద్దరు కూడా సాయం చేశారు. తాను Apple ఇన్వెంటరీ నుంచి CTrends అనే డాన్ M బేకర్ కంపెనీకి మదర్‌బోర్డులను రవాణా చేసినట్లు ప్రసాద్ వెల్లడించాడు.

Ex-Apple employee Dhirendra Prasad stole over Rs 140 crore from company, likely to get up to 20 years in jail

Ex-Apple employee Dhirendra Prasad stole over Rs 140 crore from company

అతను ఆపిల్ నకిలీ బిల్లులు చెల్లించినట్టు తెలిపాడు. బేకర్, అతను తరువాత నకిలీ బిల్లులను అందించడం ద్వారా సంపాదించిన అదనపు డబ్బును పంచుకున్నారు. అంతే కాదు.. ప్రసాద్ ఆపిల్ ప్యాకేజింగ్ నుంచి విడిభాగాలను తీసివేసి, వాటిని కొత్త పెట్టెల్లో ఉంచి, వాటిని తిరిగి Apple గూడాంకు పంపించాడు. ఈ స్కీమ్ 2018 వరకు కొనసాగాయి. చివరికి Appleకి 17 మిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని ప్రసాద్ విచారణలో అంగీకరించాడని ప్రాసిక్యూటర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసాద్ నుంచి 5 మిలియన్ డాలర్లకు పైగా ఆస్తులను అమెరికా ప్రభుత్వం జప్తు చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ 2023 మార్చి 14న జరగనుంది. ప్రసాద్ దోషిగా తేలితే 25 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అతను నేరాన్ని అంగీకరించకపోతే.. అతను 70 సంవత్సరాల ఫెడరల్ జైలులో ఉండాల్సి వస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel 5G on OnePlus : అన్ని 5G వన్‌ప్లస్, ఒప్పో ఫోన్లలో ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. ఫుల్ లిస్ట్ ఇదిగో.. 5G ఎనేబుల్ ఎలా చేయాలో తెలుసా?