petrol price today : కొన్ని ప్రాంతాల్లో మినహా.. స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

గత రెండు రోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పెట్రోల్, డీజిల్ ధరలు కొంతమేర శాంతించాయి. రెండు రోజులుగా కొన్ని సిటీల్లో మినహా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

petrol price today : కొన్ని ప్రాంతాల్లో మినహా.. స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

Petroal

petrol price today : గత రెండు రోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పెట్రోల్, డీజిల్ ధరలు కొంతమేర శాంతించాయి. రెండు రోజులుగా కొన్ని సిటీల్లో మినహా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల పెరిగిన ధరలతో వాహనదారులు బెంబేలెత్తి పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ లీటర్ రూ. 120, డీజిల్ రూ. 100 దాటాయి. పెరుగుతున్న ధరలతో సొంత వాహనాలు వదిలి ప్రైవేట్ వాహనాలను ప్రజలు ఆశ్రయించాల్సిన పరిస్థతి నెలకొంది. మరోవైపు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ దేశంలోని ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

petrol, diesel price today :ఇంధన ధరల దూకుడుకు బ్రేక్.. గుంటూరులో మినహా..

ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలను చూస్తే .. దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ రూ. 105.41 ఉండగా డీజిల్ రూ. 96.67గా ఉంది. కోల్ కత్తాలో పెట్రోల్ రూ. 115.12కాగా డీజిల్ రూ. 99.83గా ఉంది. ముంబాయి పెట్రోల్ లీటర్ రూ. 120.51, డీజిల్ రూ. 104.77గా ఉంది. అదేవిధంగా చెన్నైలో పెట్రోల్ ధరల రూ. 110.85కాగా డీజిల్ రూ. 100.94 గా ఉంది. నోయిడాలో పెట్రోల్ రూ. 13పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ లీటరు రూ. 105.60 చేరుకోగా, డీజిల్ రూ. 12పైసలు పెరిగి రూ. 97.15కు చేరుకుంది. బెంగళూరులో పెట్రోల్ రూ. 111.09 కాగా డీజిల్ లీటర్ రూ. 94.79గా ఉంది. అదేవిధంగా లక్నోలో పెట్రోల్ రూ. 3పైసలు పెరిగి రూ. 105.03కు చేరింది. డీజిల్ రూ. 2పైసలు పెరిగి రూ. 96.61కి చేరుకుంది.

Petrol Prices: ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంధన ధరలు

ఇక తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 119.49 కాగా, డీజిల్ ధర రూ. 32పైసలు పెరిగిన రూ. 107.42కు చేరింది. నిజామాబాద్ జిల్లాలో పెట్రొల్ లీటర్ రూ. 121కాగా, డీజిల్ రూ. 107.48 గా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ రూ. 07 పైసలు పెరిగి రూ. 121.25 కు చేరుకుంది. డీజిల్ రూ. 7పైసలు పెరిగి రూ. 106.86కు చేరుకుంది. గుంటూరులో పెట్రొల్ ధర పెరిగింది. ఇక్కడ లీటర్ ధర రూ. 122.08 చేరుకోగా, డీజిల్ ధర రూ. 107.63కు చేరుకుంది.