Movies delaying : ఈ సినిమాలు ఉన్నట్టా? లేనట్టా? కన్ఫర్మేషన్ ఇమ్మంటున్న ఫ్యాన్స్..

అప్పుడెప్పుడో ఈ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నామని హీరోలు, ఈ హీరోలతో సినిమా కమిట్ అయ్యామని డైరెక్టర్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఇన్నాళ్లయినా ఇంకా ఆ సినిమాలు మాత్రం స్టార్ట్ అవ్వలేదు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, హీరోలు వరసగా సినిమాలైతే అఫీషియల్ గానే అనౌన్స్ చేస్తున్నారు కానీ.................

Movies delaying : ఈ సినిమాలు ఉన్నట్టా? లేనట్టా? కన్ఫర్మేషన్ ఇమ్మంటున్న ఫ్యాన్స్..

fans asking about these hero and directors movies confirmation

Movies delaying :  అప్పుడెప్పుడో ఈ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నామని హీరోలు, ఈ హీరోలతో సినిమా కమిట్ అయ్యామని డైరెక్టర్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఇన్నాళ్లయినా ఇంకా ఆ సినిమాలు మాత్రం స్టార్ట్ అవ్వలేదు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, హీరోలు వరసగా సినిమాలైతే అఫీషియల్ గానే అనౌన్స్ చేస్తున్నారు కానీ ఆ సినిమాల్లో కొన్నింటిని పక్కన పెట్టి మళ్లీ కొత్త సినిమాలతో బిజీ అయిపోతున్నారు. అయితే ఆడియన్స్ మాత్రం అసలు ఈ సినిమాలు ఉన్నాయా లేవా అంటూ డైలమాలోఉన్నారు.

లేటెస్ట్ గా హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ విషయంలో జనాలకి ఇదే డౌటొచ్చింది. భవదీయుడు భగత్ సింగ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసి దాదాపు రెండేళ్లవుతోంది. ఈ గ్యాప్ లో వేరే సినిమా కూడా రిలీజైంది. వకీల్ సాబ్, హరిహరవీరమల్లు తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చెయ్యాల్సిన పవన్ కళ్యాణ్ మధ్యలో భీమ్లానాయక్ చేశారు. భీమ్లా తర్వాత హరిహరవీరమల్లు కంప్లీట్ చెయ్యడానికే ఆపసోపాలు పడుతున్న పవన్ మొన్నీమద్యే సడెన్ గా సుజిత్ తో OG అంటూ ఓ సినిమా మొదలుపెట్టేశారు. లేటెస్ట్ గా సముద్రఖని డైరెక్షన్లో సాయిధరమ్ తేజ్ తో మరో సినిమా అయితే ఏకంగా షూటింగ్ స్టార్ట్ చేసి షాకిచ్చారు. ఇప్పటికే 3 సినిమాలతో యమా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, దానికి తోడు రాజకీయ షెడ్యూల్స్ తో కూడా బిజీగా ఉన్న పవన్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అభిమానులు అడుగుతున్నారు. వీటికి తోడు పవన్ కళ్యాణ్ తో సినిమా కమిట్ అయ్యి ఉన్న సురేందర్ రెడ్డి కూడా ఇప్పుడు డైలమాలో పడిపోయారు. హరీష్ శంకర్ సినిమాకే దిక్కులేదు, ఇక నా సినిమా ఎప్పుడు స్టార్టవుతుందో అనుకుంటున్నారు సురేందర్ రెడ్డి. పవన్ బర్త్ డే కి ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ఏజెంట్ కంప్లీట్ అయ్యాక సురేందర్ రెడ్డి స్టార్ట్ చేసేది పవన్ కళ్యాణ్ సినిమాయే అని చెప్పేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేలా ఉంది. అందుకే అసలు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డితో సినిమా చేస్తారా లేదా అన్నది కూడా క్లారిటీ లేక డైలమాలో ఉన్నారు.

అసలు ఉందో లేదో తెలీని మరో సినిమా విజయ్ దేవరకొండ- సుకుమార్ మూవీ. ఎప్పుడో రెండేళ్ల క్రితం విజయ్ దేవరకొండ కూడా సుకుమార్ తో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత అటు సుకుమార్, ఇటు విజయ్ ఇద్దరూ ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ అయ్యారు. ఇక ఈ సినిమా లేదనుకున్న టైమ్ లో అబ్బే సినిమా ఆగిపోలేదంటూ విజయ్ హింట్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ కూడా అది సెట్స్ మీదకెళ్లలేదు. ఆల్రెడీ గౌతమ్ తిన్ననూరి, పరశురామ్ సినిమాలు అనౌన్స్ చేసిన విజయ్ సుకుమార్ తో సినిమా మాత్రం ఎప్పుడు చేస్తాడన్నది మాత్రం డౌటే. సుకుమార్ పుష్ప 2 తర్వాత ఏం సినిమానో ఇప్పటికి ప్రకటించలేదు. మరి విజయ్ తో సినిమా చేస్తాడా లేదా క్లారిటీ ఇవ్వమని అభిమానులు అడుగుతున్నారు.

వకీల్ సాబ్ డైరెక్టర్ వేణుశ్రీరామ్, అల్లుఅర్జున్ కాంబినేషన్లో అప్పుడెప్పుడో 5 ఏళ్ల క్రితం ప్రకటించిన ఐకాన్ ఇప్పుడు అడ్రస్ లేదు. అసలు సినిమా స్టార్టవుతుందా లేదా అనే క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు ఐకాన్ ఆగిపోలేదని చెబుతున్నారు. అటు హీరో అల్లు అర్జున్ ఏమో ఐకాన్ తప్ప మిగిలిన సినిమాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం పుష్ప 2, ఆ తర్వాత బోయపాటి దిరెచ్తిఒన్ లో సినిమా ఉన్నాయి. దీంతో మళ్ళీ ఐకాన్ సినిమా ఉందా లేదా అని డౌట్స్ అడుగుతున్నారు ఫ్యాన్స్.

త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సినిమా కూడా అంతే. రెండేళ్ల క్రితం అనౌన్స్ చేసిన త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. అరవింద సమేత చేసినప్పుడే ఎన్టీఆర్ తో మరో సినిమా చేస్తానని అనౌన్స్ చేసి తర్వా రిలీజ్ డేట్ తో తర్వాత సినిమా అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చెయ్యలేదు. ఎన్టీఆర్ ట్రిపుల్ తర్వాత కొరటాల శివతో సినిమా స్టార్ట్ చెయ్యాల్సిన గ్యాప్ లో త్రివిక్రమ్ తో సినిమా చేసేస్తాడేమో అనుకున్నారు అంతా. కానీ అది కూడా జరగలేదు. త్రివిక్రమ్ -ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని అందరూ అంటున్నా అసలుంటుదా లేదా అన్నది మాత్రం ఇంకా డైలమానే.

20 ఏళ్లుగా తమిళ్ లో హీరోగా కంటిన్యూ అవుతున్న ధనుష్ తెలుగులో ఫస్ట్ సినిమా శేఖర్ కమ్ములతో అనౌన్స్ చేశారు. కానీ రెండేళ్లయినా ఇప్పటి వరకూ ఆ సినిమా మాత్రం సెట్స్ మీదకెళ్లలేదు. ఈ గ్యాప్ లోనే లేటెస్ట్ గా వెంకీ అట్లూరితో సార్ సినిమా చేసి హిట్ అందుకున్నారు ధనుష్. టాలీవుడ్ లో మంచి క్రేజ్ రావడంతో శేఖర్ కమ్ముల సినిమా గురించి చర్చ జరుగుతోంది. దాంతో ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఈ సినిమా ఉన్నాట్టా లేనట్టా అన్న ఆలోచనలో పడ్డారు ఆడియన్స్ . దానిపై క్లారిటీ ఇమ్మని శేఖర్ కమ్ములని అడుగుతున్నారు.

Pan India Artists : పాన్ ఇండియా ఆర్టిస్టులు.. వీళ్ళు సినిమాల్లో ఉంటే సినిమాకే ప్లస్సు..

4 సినిమాలతో నాన్ స్టాప్ షూటింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగాతో స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసి రెండేళ్లయ్యింది. అయితే ఇప్పటి వరకూ ఆ సినమా సెట్స్ మీదకెళ్లిందే లేదు. కనీసం పూజ కార్యక్రమాలు కూడా జరగలేదు. సందీప్ తో సినిమా అనౌన్స్ చేసిన తర్వాత కూడా ప్రభాస్ వేరే సినిమాలు కమిటయ్యి కంప్లీట్ చేస్తున్నారు కానీ సందీప్ తో సినిమా ఊసెత్తడం లేదు. అటు సందీప్ కూడా బాలీవుడ్ లో యానిమల్ తో బిజీగా ఉన్నాడు. అందుకే ఈ స్పిరిట్ మూవీ ఉన్నట్టా..? లేనట్టా అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. అసలే ఇది ప్రభాస్ 25వ సినిమాగా ప్రకటించారు. మరి సందీప్ వంగతహా ప్రభాస్ 25వ సినిమా అవస్తుందా లేదా అని ఆలోచనలో పడ్డారు అభిమానులు.