Warangal : టెస్కో గోదాంలో ఫైర్ ఆక్సిడెంట్.. రూ. 40 కోట్లు బూడిద

ప్రభుత్వం టెక్స్‌టైల్‌ గోదాంలో సోమవారం రాత్రి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. 4 ఫైరింజన్ల సాయంతో మంటలు

Warangal : టెస్కో గోదాంలో ఫైర్ ఆక్సిడెంట్.. రూ. 40 కోట్లు బూడిద

Warangal

Tesco Warehouse Warangal : వరంగల్ జిల్లా ధర్మారంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. 12 గంటల నుంచి 4 ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నగర శివారులోని ప్రభుత్వం టెక్స్‌టైల్‌ గోదాంలో సోమవారం రాత్రి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. 4 ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటల వేడికి గోదాం గోడలు సైతం కూలిపోయాయి.

Read More : Warangal MGM Victim Died : వరంగల్‌ ఎంజీఎంలో ఎలుకలదాడిలో గాయపడిన బాధితుడు మృతి

ఈ గోదాంలో విద్యార్ధులకు అందచేసే చేనేత దుస్తులను నిల్వ చేస్తుంటారు. వీటిని పాఠశాలలకు పంపించాల్సి ఉంటుంది. కానీ.. ఇటీవలి కాలంలో కరోనా విజృంభించడంతో పాఠశాలలు మూసివేశారు. దీంతో గోదాంలోనే ఆ వస్త్రాలు ఉండిపోయాయి. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుస్తులు కావడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. వాచ్ మెన్ సమాచారం ఇవ్వడంతో గోదాం ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌, డీఎంవో శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదం వల్ల.. రూ .40 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.