Covid Vaccine: జంతువులకు కూడా కొవిడ్ వ్యాక్సిన్.. ఇండియాలో తొలిసారి

కొవిడ్ వ్యాక్సిన్ వ్యక్తులకే కాదు పశువులకు కూడా తీసుకొచ్చారు మన నిపుణులు. ఇండియాలో తొలిసారి పశువుల కోసం కొవిడ్ వ్యాక్సిన్ రెడీ అయింది. హర్యానాకు చెందిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ Anocovax అనే కొవిడ్ వ్యాక్సిన్ డెవలప్ చేసింది.

Covid Vaccine: జంతువులకు కూడా కొవిడ్ వ్యాక్సిన్.. ఇండియాలో తొలిసారి

Covax

Covid Vaccine: కొవిడ్ వ్యాక్సిన్ వ్యక్తులకే కాదు పశువులకు కూడా తీసుకొచ్చారు మన నిపుణులు. ఇండియాలో తొలిసారి పశువుల కోసం కొవిడ్ వ్యాక్సిన్ రెడీ అయింది. హర్యానాకు చెందిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ Anocovax అనే కొవిడ్ వ్యాక్సిన్ డెవలప్ చేసింది.

ఈ Anocovax వ్యాక్సిన్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తుంది. కుక్కలు, సింహాలు, చిరుతలు, చుంచెలుకలకు ఈ వ్యాక్సిన్ సేఫ్ అని కంపెనీ పేర్కొంది.

“సైంటిస్టుల నిర్విరామ కృషితో సొంత వ్యాక్సిన్లు తయారుచేసుకోగలిగాం. లేదంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉండేది. ఇది నిజంగా పెద్ద విజయం” ని అగ్రికల్చర్ మినిష్టర్ నరేంద్ర సింగ్ తోమర్ వర్చువల్ గా లాంచ్ చేశారు.

Read Also : కార్బెవాక్స్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌.. డీసీజీఐ అనుమతి..

ఈ Anovac వ్యాక్సిన్ తో పాటు ‘CAN-CoV-2 ELISA కిట్‌ను కూడా లాంచ్ చేశారు.ఈ ఎలిసా కిట్ న్యూక్లియోకాప్సిడ్ ప్రొటీన్ ను ఇన్ డైరక్ట్ గా అందజేస్తుంది. ఇది SARS-CoV2పై సమర్థవంతంగా పనిచేస్తుంది.

“జంతువుల కోసం రీసెర్చ్ చేసేందుకు ల్యాబొరేటరీలు లేవు. కిట్ భారతదేశంలో తయారు చేసి దాని పేటెంట్ హక్కుల కోసం అప్పీల్ చేశారు. కుక్కలలో ప్రతిరోధకాలను గుర్తించడానికి ఇతర పోల్చదగిన కిట్‌లు మార్కెట్లో అందుబాటులో లేవు ”అని ICAR తెలిపింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw