RRR : థియేటర్ వద్ద ఫ్లెక్సీల వివాదం.. ఆందోళన చేస్తున్న అభిమానులు..

ఇప్పటికే పలు చోట్ల ఇరు హీరోల అభిమానుల మధ్య గొడవలు జరుగగా తాజాగా ఇవాళ ఉదయం నెల్లూరు వెంకటగిరిలో మరో గొడవ రాజుకుంది. నెల్లూరు వెంకటగిరిలోని సెల్యులాయిడ్ థియేటర్ వద్ద ఫ్లెక్సీల.......

RRR :  థియేటర్ వద్ద ఫ్లెక్సీల వివాదం.. ఆందోళన చేస్తున్న అభిమానులు..

Rrr Fans

 

RRR :  రాజమౌళి దర్శకత్వంలో తారక్, చెర్రీలతో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తుంది. మొదటి రోజు భారీ కలెక్షన్లని సాధించి దూసుకుపోతుంది. సినిమా చూసిన వారంతా రాజమౌళి, చరణ్, తారక్ లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలని పెట్టి సినిమా తీయాలంటే ఎంతో గట్స్ ఉండాలి. ఏ మాత్రం అటు ఇటు అయినా అభిమానుల మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఉంది.

అయితే రాజమౌళి మాత్రం స్టార్ డం పక్కన పెట్టి యాక్టర్స్ గా మాత్రమే చెర్రీ, తారక్ లని తీసుకొని సినిమా చేశాను అని పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. ఫ్యాన్స్ మధ్య గొడవలు రాకుండా ఉండటానికి చెర్రీ, తారక్ లు కలిసి ఇంటర్వ్యూలు ఇస్తూ, కామెడీ జనరేట్ చేస్తూ ఒకరికొకరు తమ స్నేహం గురించి చెప్తూ ప్రమోట్ చేశారు. అయినా కొన్ని చోట్ల మాత్రం అభిమానుల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. బ్యానర్స్, టికెట్స్ లాంటి కొన్ని విషయాల్లో ఈ గొడవలు జరుగుతున్నాయి.

RRR Collections : అమెరికా, ఆస్ట్రేలియాలో కలెక్షన్ల సునామి.. విదేశాల్లో ‘ఆర్ఆర్ఆర్’ హవా..

ఇప్పటికే పలు చోట్ల ఇరు హీరోల అభిమానుల మధ్య గొడవలు జరుగగా తాజాగా ఇవాళ ఉదయం నెల్లూరు వెంకటగిరిలో మరో గొడవ రాజుకుంది. నెల్లూరు వెంకటగిరిలోని సెల్యులాయిడ్ థియేటర్ వద్ద ఫ్లెక్సీల రూపంలో ఈ వివాదం మొదలైంది. థియేటర్ వద్ద ఇరు హీరోల అభిమానులు తమ తమ హీరోల ఫ్లెక్సీలని కట్టారు. అయితే నిన్న అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను కొంతమంది దుండగులు చింపేసారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ బయట ఆందోళనలు చేస్తున్నారు. థియేటర్ యాజమాన్యం సిసి టీవీ ఫుటేజ్ ఇవ్వాలని, వేరే హీరో అభిమానులే ఈ పని చేసి ఉంటారని ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చేపట్టారు.

RRR : ఒకప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు పొగుడుతున్నారు.. చరణ్ పై బాలీవుడ్ ప్రశంసలు

విషయం తెలిసి వెంకటగిరి పోలీసులు అక్కడికి చేరుకొని ఎన్టీఆర్ అభిమానులతో మాట్లాడారు. సిసిటివి ఫుటేజ్ ను పరిశీలిస్తామని, అవి ఎవరు చింపారో చూస్తామని తెలిపారు. అంతేకాక ఫ్లెక్సీలు వివాదానికి కారణమవడంతో పోలీసులు థియేటర్ వద్ద ఉన్న మొత్తం ఫ్లెక్సీలను తొలగించారు. దీనికి చరణ్ ఫ్యాన్స్ అభ్యంతరం తెలిపినా పోలీసులు తమ పని తాము చేసుకెళ్లారు.