Flipkart Mobiles: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. తన కస్టమర్లకోసం మొబైల్‌ బొనాంజా సేల్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

Flipkart Mobiles: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

Bonanza

Flipkart: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. తన కస్టమర్లకోసం మొబైల్‌ బొనాంజా సేల్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్‌ బొనాంజా సేల్స్‌ ప్రారంభం అవ్వగా.. నవంబర్ 21వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్స్‌లో భాగంగా పలు మొబైల్స్‌పై, మొబైల్‌ యాక్సేసరిస్‌పై భారీ ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్సేంజ్ ఆఫర్లు ఇందులో ఉండగా.. రూ.20వేల కన్నా తక్కువ ధరలో మొబైల్ కొనాలనేవారికి ఈ సేల్‌లో బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Realme 8 5G: ఫ్లిప్ కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్‌లో Realme 8 5G ఫోన్ 64 జీబీ బేస్ మోడల్ రూ.15,499కే ఆఫర్‌లో వస్తుంది. ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉండగా.. 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇంకా 5000 mAh భారీ బ్యాటరీతో ఈ ఫోన్ పనిచేస్తుంది. 18W ఫాస్ట్ చార్జింగ్ ఫోన్‌కు సపోర్ట్ చేస్తుంది.

Redmi Note 10T 5G: Xiaomi సబ్-బ్రాండ్ Redmi అత్యంత ప్రజాదరణ పొందిన నోట్ సిరీస్ క్రింద తన ఫస్ట్ 5G ఫోన్‌ను విడుదల చేసింది. Redmi Note 10T 5G 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల పూర్తి-HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. MediaTek డైమెన్సిటీ 700 SoC మరియు 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇందులో ఉన్నాయి. ఇది 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ సేల్‌లో ఫోన్‌ను రూ. 16,990కు సొంతం చేసుకోవచ్చు.

Poco M3 Pro 5G: Redmi Note 10T 5G, Poco M3 Pro రెండూ కూడా చాలావరకు ఒకే ఫీచర్లను కలిగి ఉంటాయి. కాబట్టి కస్టమర్‌లు అమ్మకపు ఆఫర్‌లను బట్టి ఒకదాన్ని కొనుక్కోవచ్చు. Poco M3 Pro 5G 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.53-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 6GB వరకు RAM, 48-మెగాపిక్సెల్ ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌తో లింక్ చేసి ఉంటుంది. కస్టమర్లు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కూడా ఇందులో పొందుతారు. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 14,499 నుంచి ప్రారంభం అవుతుంది.

Moto G40 Fusion: డ్యూయల్-సిమ్ సపోర్టింగ్ Moto G40 Fusion 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల పూర్తి-HD+ డిస్‌ప్లే ఇందులో ఉంటుంది. ఫోన్‌లో Qualcomm Snapdragon 732G SoC, 4GB మరియు 6GB RAM ఎంపికలు ఉన్నాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ సమయంలో ఈ ఫోన్ రూ. 13,499కే లభిస్తుంది.