Nupur Sharma: నుపుర్ శర్మ కేసులో మరో వివాదం

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ వ్యాఖ్యలపై మరో వివాదం చెలరేగింది. 15 మంది మాజీ జడ్జిలతో పాటు, 77 మంది మాజీ బ్యూరో క్రాఫ్ట్స్, 25మంది ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు ఆమెపై విమర్శలు గుప్పించారు.

Nupur Sharma: నుపుర్ శర్మ కేసులో మరో వివాదం

Nupur Sharma Should Apologise To Country (1)

Nupur Sharma: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ వ్యాఖ్యలపై మరో వివాదం చెలరేగింది. 15 మంది మాజీ జడ్జిలతో పాటు, 77 మంది మాజీ బ్యూరో క్రాఫ్ట్స్, 25మంది ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు ఆమెపై విమర్శలు గుప్పించారు. బీజేపీ సస్పెండ్ చేసిన లీడర్.. మొహమ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్లే ఈ అల్లర్లకు, ఆందోళనలకు కారణమని పేర్కొన్నారు.

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సీవీ రమణకు ఓపెన్ లెటర్ రాసిన ఇద్దరు జడ్జిల ధర్మాసనం.. దేశంలో జరుగుతున్న అల్లర్లకు ఆమె ఒక్కరే బాధ్యత వహించాలని, ఉదయ్‌పూర్‌లో జరిగిన హత్య ఆమెకు సపోర్ట్ చేసిన కారణంగానే జరిగిందని అందులో ప్రస్తావించారు.

ఆమెను అరెస్టు చేయాలని దేశంలోని పలు ప్రాంతాల్లో నుంచి వస్తున్న డిమాండ్లన్నింటినీ కలిపి ఢిల్లీకి ట్రాన్సఫర్ చేయాలని సుప్రీం కోర్టును డిమాండ్ చేయడానికి వెళ్లింది. ఆమె ప్లీను జులై 1న కొట్టిపారేసిన కోర్టు.. నోరు పారేసుకోవడం కారణంగా యావత్ దేశమంతా రగిలిపోతుంది. చీప్ పబ్లిసిటీ, నీచమైన కార్యకలాపాలు, పొలిటికల్ అజెండాతో ఇలా చేశారని తిట్టిపోసింది.

prophet row: విచార‌ణ‌కు రావ‌డానికి స‌మ‌యం ఇవ్వండి: నుపుర్ శ‌ర్మ‌

ఆమె చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని.. న్యాయబద్ధంగా లేవని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలా ఓపెన్ లెటర్ లో పేర్కొన్నారు. ఆమె పిటిషన్‌లో లేవనెత్తిన సమస్యతో పరిశీలనలకు సంబంధం లేదని పేర్కొంది.

జూలై 1న, శర్మ తరపు న్యాయవాది ఆమెకు బెదిరింపులు వస్తున్నాయని, వివిధ రాష్ట్రాల్లో విచారణ కోసం వెళ్లడం సురక్షితం కాదని కోర్టుకు విన్నవించారు. దీనిపై జస్టిస్ సూర్య కాంత్ సమాధానమిస్తూ.. “ఆమె బెదిరింపులను ఎదుర్కొంటుందా లేదా దేశానికి భద్రతా ముప్పుగా మారిందా?. .. ఇది సిగ్గుచేటు. ఆమె దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలి” అని సూచించారు.

నుపుర్ శర్మను మరింత విమర్శించిన కోర్టు.. “మొండి, అహంకార స్వభావానికి నిదర్శనంగా మారాయి” అని కోర్టు పేర్కొంది. “ఒక పార్టీకి అధికార ప్రతినిధి అయితే అధికారం ఉందని, దేశంలోని చట్టాన్ని గౌరవించకుండా ఏదైనా ప్రకటన చేయగలనని భావిస్తుందా” అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.