Telugu Academy : తెలుగు అకాడమీలో గోల్ మాల్.. కలర్ జిరాక్స్‌లతో రూ. 64 కోట్లు మాయం

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ హాట్ టాపిక్‌గా మారింది.కలర్ జిరాక్స్ ల పేరిట రూ. 64 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు రద్దు చేసి, నకిలీ పత్రాలతో బ్యాంకు తెరిచినట్లు విచారణలో తేలింది.

Telugu Academy : తెలుగు అకాడమీలో గోల్ మాల్.. కలర్ జిరాక్స్‌లతో రూ. 64 కోట్లు మాయం

Telugu Acadamy

Cheat Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తవ్వేకొద్దీ ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిధుల బదలాయింపు ఇంటి దొంగల పనేనని పోలీసులు తేల్చారు. దీంతో.. తెలుగు అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డిపై వేటు పడింది. ఆయన స్థానంలో తాత్కాలిక డైరెక్టర్‌గా దేవసేనను నియామించింది ప్రభుత్వం. స్కామ్‌పై విచారణ జరుగుతుండగా సోమిరెడ్డి డైరెక్టర్‌గా కొనసాగితే.. రాంగ్‌ మెస్సేజ్‌ వెళుతుందని అభిప్రాయపడ్డ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

Read More : Movies : రెండు పార్టులుగా వస్తున్న సినిమాలు..

గోల్ మాల్ లో దళారులదే కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. కలర్ జిరాక్స్ ల పేరిట రూ. 64 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు రద్దు చేసి, నకిలీ పత్రాలతో అకాడమీ పేరిట బ్యాంకు ఖాతాను తెరిచినట్లు విచారణలో తేలింది. ఏపీ మర్కంటైల్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఛైర్మన్ బీవీవీఎస్ సత్యనారాయణ, సొసైటీ మేనేజర్ వేదుల పద్మావతి, రిలేషన్స్ మేనేజర్ సయ్యద్ మొహినుద్దీన్ లను హైదరాబాద్ లో అరెస్టు చేసినట్లు సీసీఎస్ జాయింట్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. రూ. 64 కోట్ల అకాడమీ నిధులు..వివిధ బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసే సమయంలో..ముగ్గురు ఏజెంట్లుగా వ్యవహరించారని, ఈ బాండ్లను కలర్ జిరాక్స్ తీసినట్లు తెలుస్తోంది. కలర్ జిరాక్స్ బాండ్లతో మూడు బ్యాంకుల్లోని రూ. 64 కోట్ల డిపాజిట్లు రద్దు చేయించారు.

Read More : Pawan Kalyan : మంచు విష్ణు సినిమా బ‌డ్జెట్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా మార్నింగ్ షో క‌లెక్ష‌న్స్ అంత కూడా ఉండదు..

బ్యాంకు అధికారులు దళారులతో కుమ్మక్కై …ఈ మొత్తాన్ని అగ్రసేన్ బ్యాంకులోని ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాలోకి బదిలీ చేశారని నిర్ధారించారు. అనంతరం సొసైటీ ఖాతా నుంచి అకాడమీ పేరిట ఉన్న ఖాతాలోకి రూ. 64 కోట్లు బదిలీ చేసుకుని.. మాయం చేశారు. ఈ క్రమంలో విద్యా శాఖ డైరెక్టర్ శ్రీ దేవససేనకు అకాడమీ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. నిధుల గోల్ మాల్ వ్యవహారంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. అకాడమీ నిధుల గోల్‌మాల్‌ను సర్కార్‌ సీరియస్‌గా తీసుకుంది. ఈ తతంగం నడిపిన ఎవరినీ విడిచిపెట్టేది లేదంటోంది. ఉమ్మడి ఆస్తులు కావడంతో ఎవరూ పట్టించుకోరన్న ధీమాతో.. కోట్లు కొట్టేసినవారిని తేలికగా విడిచిపెట్టేదిలేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో అక్రమార్కులు వణికిపోతున్నారు.