Fake Certificates: నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా అరెస్టు

నిందితులు కాకతీయ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు. నిందితుల్లో ఒకడైన రోహిత్ ఐటీ ఉద్యోగి. ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసి డబ్బులు దండుకుంటున్నాడు.

Fake Certificates: నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా అరెస్టు

Fake Certificates

Fake Certificates: నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి విక్రయిస్తూ, మోసాలకు పాల్పడుతున్న ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ కమిషనర్ మహేహ్ భగవత్ నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. ‘‘తెలంగాణతోపాటు, కర్ణాటక యూనివర్సిటీల పేరుతో నిందితులు నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.

Y.S.JAGAN: పేదరికాన్ని పారద్రోలేందుకే జగనన్న విద్యాకానుక: సీఎం జగన్

ఈ అంశంపై చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసులో ప్రధాన సూత్రధారి రోహిత్‌తోపాటు, మరో ముగ్గురిని అరెస్టు చేశాం. నిందితులు కాకతీయ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు. నిందితుల్లో ఒకడైన రోహిత్ ఐటీ ఉద్యోగి. ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసి డబ్బులు దండుకుంటున్నాడు. శ్రీలక్ష్మీ కన్సల్టెన్సీ ద్వారా ఈ దందా కొనసాగిస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.30-40 వేల వరకు తీసుకుంటున్నారు.

Teegala Krishna Reddy: మంత్రి సబితపై తీగల కృష్ణారెడ్డి భూ కబ్జా ఆరోపణలు

లేని కాలేజీల పేర్ల మీద కూడా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. విదేశాలకు వెళ్లేవాళ్లు ఎక్కువగా ఈ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 20 వరకు సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలిసింది. ఆరు నెలల నంచి ఈ దందా సాగిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ల్యాప్‌టాప్స్, ప్రింటర్స్, మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాం’’ అని కమిషనర్ చెప్పారు.