Glass Tumbler In Colon : OMG.. వ్యక్తి కడుపులో టీ గ్లాస్.. ఎలా వెళ్లిందబ్బా?

బీహార్ ముజఫర్ పూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ కేసుని డీల్ చేసిన డాక్టర్లు సైతం విస్తుపోయారు. ఓ మై గాడ్.. ఇట్స్ రియల్లీ వండర్ అని ముక్కున వేలేసుకుంటున్నారు.

Glass Tumbler In Colon : OMG.. వ్యక్తి కడుపులో టీ గ్లాస్.. ఎలా వెళ్లిందబ్బా?

Glass Tumbler

Glass Tumbler In Colon : బీహార్ ముజఫర్ పూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ కేసుని డీల్ చేసిన డాక్టర్లు సైతం విస్తుపోయారు. ఓ మై గాడ్.. ఇట్స్ రియల్లీ వండర్ అని ముక్కున వేలేసుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. ఓ వ్యక్తి కడుపులో టీ గ్లాస్ బయటపడింది. కడుపులో టీ గ్లాసా? షాక్ అయ్యారు కదూ. సరిగ్గా.. ఆ డాక్టర్లు కూడా ఇలానే ఆశ్చర్యానికి లోనయ్యారు. ముజఫర్ పూర్ లో ఓ వ్యక్తి కడుపులో ఏకంగా చాయ్ గ్లాస్ బయటపడింది.

అతడి వయసు 55ఏళ్లు. కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పి, మలబద్దకంతో బాధపడుతున్నాడు. నొప్పి భరించలేక ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రి డాక్టర్లు అతడి సమస్య ఏంటో తెలుసుకునేందుకు ఎక్స్ రే తీయించారు. రిపోర్ట్ చూసి షాక్ తిన్నారు. ఎక్స్ రే తీయగా కడుపులో చాయ్ గ్లాస్ ఉన్నట్లు గుర్తించారు.

Glass In Colon

Glass In Colon

ఎండోస్కోపిక్ ద్వారా గ్లాస్ ను బయటకు తీసేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆపరేషన్ చేసి గ్లాస్ ని బయటకు తీశారు. అయితే, అసలా గ్లాస్ ఆ వ్యక్తి కడుపులోకి ఎలా వెళ్లింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. చాయ్ తాగేటప్పుడు తాను గ్లాస్ మింగేశానని బాధితుడు చెప్పినా డాక్టర్లు నమ్మలేదు. ఎందుకంటే, ఆహారనాళంలో గ్లాస్ పట్టదని, మలద్వారం నుంచే వెళ్లి ఉంటుందని డాక్టర్లు అనుమానిస్తున్నారు.

Youth rescued by IAF: కర్ణాటకలో 300 అడుగులలోతులో పడిపోయిన యువకుడిని కాపాడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

సర్జన్ల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ మఖ్దులుల్ హక్ దీనిపై స్పందించారు. బాధితుడు వైశాలి జిల్లాలోని మహువాకు చెందిన వ్యక్తి అని చెప్పారు. అల్ట్రాసౌండ్, ఎక్స్-రే నివేదికల ప్రకారం ఆ వ్యక్తి పెద్ద పేగులో ఏదో తప్పుగా ఉన్నట్లు తేలిందన్నారు. బాగా పరిశీలించాక అది గ్లాస్ తంబ్లర్ గా గుర్తించామన్నారు. అయితే గ్లాస్ తంబ్లర్ ఆ వ్యక్తి పేగులలోకి ఎలా వెళ్లింది అనేది మిస్టరీగా మారిందన్నారు.

దీని గురించి పేషేంట్ ను విచారించాము. టీ తాగేటప్పుడు గ్లాస్ ని మింగేశానని అతడు చెప్పాడు. అయితే అతడు చెప్పింది నమ్మదగినది కాదు. మనిషి ఆహార పైపు చాలా చిన్నగా ఉంటుంది. పెద్ద సైజులో ఉండే గ్లాస్ అందులో పట్టదు. తొలుత ఎండోస్కోపిక్ పద్ధతిలో అతడి రెక్టమ్ నుంచి గ్లాస్ ను బయటకు తీసేందుకు ప్రయత్నం చేసినట్టు చెప్పారు. కానీ సాధ్యం కాలేదన్నారు. దీంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చిందన్నారు. అతడి పొత్తి కడుపు కోసి గ్లాస్ ను బయటకు తీయాల్సి వచ్చిందని డాక్టర్ హక్ వివరించారు.

ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. అతడు కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు. శస్త్రచికిత్స తర్వాత పెద్దపేగు కుట్టడం, మలం విసర్జించగలిగే ఫిస్టులార్ ఓపెనింగ్ సృష్టించబడినందున కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని డాక్టర్ హక్ చెప్పారు. “కొన్ని నెలల్లో అతని పెద్దపేగు నయం అవుతుందని భావిస్తున్నాం. ఆ తర్వాత మేము ఫిస్టులాను మూసివేస్తాము. అతని పేగులు సాధారణంగా పని చేస్తాయి” అని వెల్లడించారు. ఆపరేషన్ తర్వాత రోగి స్పృహలోకి వచ్చినప్పటికీ, అతను లేదా అతని కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు.

“మానవ శరీర నిర్మాణ శాస్త్రంపై మనకున్న అవగాహన ప్రకారం, గాజు టంబ్లర్ అక్కడికి చేరుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది అంగ ద్వారం ద్వారా అతని శరీరంలోకి నెట్టబడింది. కానీ వాస్తవాలను లోతుగా తవ్వడం వల్ల రోగి అసహ్యకరమైన వివరాలు బయటకు రావచ్చు. బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. డాక్టర్లుగా మేము అతడి గోప్యతను రక్షించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాము” అని డాక్టర్ హక్ అన్నారు.