Sarojadevi Hospital : కంటి వెలుగు ద్వారా 5 నెలల్లో కోటి 50 లక్షల మందికి కంటి పరీక్షలు – హరీష్ రావు

ప్రజలకు గ్లూకోమా గురించి అవగాహన కల్పించాలని, ఈ వ్యాధి వచ్చినట్టు కూడా తెలియదన్నారు. ఈ వ్యాధి వస్తే కంటి చూపుని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు...

Sarojadevi Hospital : కంటి వెలుగు ద్వారా 5 నెలల్లో కోటి 50 లక్షల మందికి కంటి పరీక్షలు – హరీష్ రావు

Harishrao

Glaucoma Day Celebration In Sarojadevi Hospital : ప్రపంచంలోనే కంటి వెలుగులాంటి కార్యక్రమం ద్వారా ప్రజలకు కంటి పరీక్షలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆరే గారికే చెందుతుందన్నారు మంత్రి హరీష్ రావు. కంటి వెలుగు ద్వారా 5 నెలల్లో కోటి 50 లక్షల మందికి కంటి పరీక్షలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని తెలిపారు. సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో వరల్డ్ గ్లూకోమా డే వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కరోనా సమయంలో పనిచేస్తూ మరణించిన ANM వరలక్ష్మి అనే మహిళ కుటుంబానికి రూ. 50 లక్షలు ఇన్సూరెన్స్ చెక్ ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..

Read More : Minister V Srinivas Goud : జితేందర్ రెడ్డి పీఏ కి మరోసారి నోటీసులు

అసుపత్రుల్లో పెద్ద ఎత్తున డెలివరీలు జరుగుతున్నాయని తెలిపారు. కరోనాలో సమయంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అద్భుతంగా పని చేశారని ప్రశంసించారు. అక్కడక్కడ వృత్తిలో ప్రాణాలను కూడా కొల్పోయారని, ఇప్పటి వరకు 45 కోట్ల రూపాయలను చనిపోయిన వారి కుటుంబాలకు అందించామన్నారు. ప్రజలకు గ్లూకోమా గురించి అవగాహన కల్పించాలని, ఈ వ్యాధి వచ్చినట్టు కూడా తెలియదన్నారు. ఈ వ్యాధి వస్తే కంటి చూపుని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బీపీ, షుగర్ ఉన్నవాళ్లలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా 40 సంవత్సరాలు దాటిన వారిల్లో బీపీ, షుగర్ 3 శాతం ఉందన్నారు. సరోజినిదేవి కంటి ఆసుపత్రిపైన త్వరలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు మంత్రి హరీష్ రావు.