Gopichand: ‘పక్కా కమర్షియల్’ బరిలోకి దిగేది అప్పుడే!

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి....

Gopichand: ‘పక్కా కమర్షియల్’ బరిలోకి దిగేది అప్పుడే!

Pakka Commercial

Gopichand: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్న చిత్ర యూనిట్, ఈ సినిమాకు ‘పక్కా కమర్షియల్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ప్రేక్షకుల్లో ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ చేశారు.

Pakka Commercial : పోస్టర్‌లోనూ మారుతి మార్క్! మే 20న మ్యాచో స్టార్ సినిమా

కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో పలుమార్లు తమ నిర్ణయాన్ని మార్చుకుంది చిత్ర యూనిట్. వేసవి కానుకగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన మారుతి అండ్ టీమ్, ఇప్పుడు మరోసారి తమ రిలీజ్ డేట్‌ను మార్చుకున్నారు. ఈ సినిమాను తాజాగా జూలై 1న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. వరుసగా సినిమాలు రిలీజ్‌కు రెడీ కావడంతో పోటీ వాతావరణం క్రియేట్ చేయడం ఇష్టం లేదని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే వేసవి ముగిశాకే తమ సినిమాను రిలీజ్ చేయాలని.. జూలై 1న సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు.

Gopichand30: శ్రీవాస్-గోపీచంద్ క్రేజీ కాంబినేషన్.. కీలక పాత్రలో ఖుష్బూ

అయితే కొద్దిసేపటి క్రితమే మరో చిత్రం ‘రంగరంగ వైభవంగా’ కూడా అదే రోజున తమ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. దీంతో జూలై 1న కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పదా అని అందరూ అనుకుంటున్నారు. ఇక పక్కా కమర్షియల్ చిత్రంలో గోపీచంద్ పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. కాగా ఈ సినిమాలో గోపీచంద్ సరసన అందాల భామ రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, సప్తగిరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్, GA2 పిక్చర్స్ ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటంతో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.