Gopichand30: శ్రీవాస్-గోపీచంద్ క్రేజీ కాంబినేషన్.. కీలక పాత్రలో ఖుష్బూ

మ్యాచోస్టార్ గోపీచంద్ కెరియర్ లో లక్ష్యం సినిమా ముమ్మాటికీ భారీ సక్సెస్ సినిమానే. అనుష్క, జగపతి బాబు, కోటా శ్రీనివాస్ రావు లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటికీ..

Gopichand30: శ్రీవాస్-గోపీచంద్ క్రేజీ కాంబినేషన్.. కీలక పాత్రలో ఖుష్బూ

Gopichand30

Gopichand30: మ్యాచోస్టార్ గోపీచంద్ కెరియర్ లో లక్ష్యం సినిమా ముమ్మాటికీ భారీ సక్సెస్ సినిమానే. అనుష్క, జగపతి బాబు, కోటా శ్రీనివాస్ రావు లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటికీ టీవీల్లో అదే ఆదరణ దక్కించుకుంటుంది. ఆ తర్వాత వాంటెడ్, మొగుడు లాంటి ప్లాపులలో ఉన్న గోపీచంద్ కు అదే కాంబినేషన్ లో వచ్చిన లౌక్యం సినిమా రిలీఫ్ ఇచ్చింది. కాగా, ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మూడవ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది. గోపీచంద్‌ కెరీర్‌లో ఇది 30వ సినిమా కాగా పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

Gopichand 30: మ్యాచోస్టార్ మొదలు పెట్టేస్తున్నాడు.. హ్యాట్రిక్ కొడతారా?

భూపతిరాజా రాసిన ఈ కథను శ్రీవాస్ తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్ ద్వారా ఇది కలకత్తా బ్యాక్ డ్రాప్ కథగా రివీల్ చేయగా.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాకు టైటిల్‌ ఖరారు కావాల్సి ఉండగా.. ఈ గురువారం మార్చి 3 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో గోపిచంద్ జోడీగా డింపుల్ హయతీ హీరోయిన్ గా నటించనుండగా.. ఇప్పుడు ఈ సినిమా కోసం మరో సీనియర్ నటిని ఎంచుకున్నారు టీమ్.

Butter Fly Teaser: పిల్లల కోసం అనుపమ వెతుకులాట.. థ్రిల్లర్‌గా బటర్ ఫ్లై!

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ నటి ఖుష్బు సుందర్‌ని ఎంపిక చేసినట్లు టీమ్ ప్రకటించింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో జగపతిబాబు కూడా మరో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే కాగా.. ఒక్కొక్కరు స్టార్ క్యాస్టింగ్ కూడా యాడ్ చేస్తున్న మేకర్స్ సినిమాకు మరింత వెయిట్ పెంచే పనిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. మరి ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతారా లేదా అన్నది చూడాల్సి ఉండగా ప్రస్తుతం గోపీచంద్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో నటించిన ‘పక్కా కమర్షియల్‌’ సినిమా విడుదలకు సిద్దమవుతుంది.