Domestic Air Travel: అమాంతం పెరిగిన దేశీయ విమాన ఛార్జీలు

పౌర విమానయాన శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా రివైజ్ చేసిన ధరలను జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.

Domestic Air Travel: అమాంతం పెరిగిన దేశీయ విమాన ఛార్జీలు

Govt Has Made Changes To Domestic Air Travel

Domestic Air Travel: పౌర విమానయాన శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా రివైజ్ చేసిన ధరలను జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. గతంలోని ఛార్జీల వివరాలను అప్‌డేట్ చేసే పనిలో పడ్డాయి విమానయాన సంస్థలు.

తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం.. విమానయాన కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెరగనున్నాయి.
* 40 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2వేల 300 నుంచి రూ.2వేల 600గా ఉండనుంది.
* 60 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2వేల 900 నుంచి రూ.3వేల 300గా పెరగనుంది.
* 60 నుంచి 90 నిమిషాల ప్రయాణానికి కనీస పరిమితి రూ.4వేలు, 90 నుంచి 120 నిమిషాలకు రూ.4వేల 700, 120 నుంచి 150 నిమిషాలకు రూ.6వేల 100, 180-210 నిమిషాలకు 8వేల 700గా ఉండనుంది.

జూన్ ఒకటో తేదీ నుంచి విమాన‌యాన సంస్థ‌లు 50 శాతం స‌ర్వీసుల‌ను మాత్ర‌మే న‌డ‌పాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకూ కొవిడ్ కారణంగా 80 శాతం స‌ర్వీసుల‌కు పర్మిషన్ ఉంది. మే నెల‌లో సుమారు 40 వేల మంది ప్ర‌యాణికులు మాత్రమే దేశీయ విమానాల్లో తిరిగిన‌ట్లు తెలుస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా నష్టపోయిన విమానయాన రంగానికి ఊతమిచ్చేలా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ తర్వాత ఈ ఏడాది మార్చి నుంచి విమానయాన సేవలు అంతంత మాత్రమే కొనసాగాయి.

పెరిగిన ధరలు ఇవే..
కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెంపు
* 40 నిమిషాల ప్రయాణం: రూ.2వేల 600కు పెంపు..అత్యధిక ధర రూ.7వేల 800
* 60 నిమిషాల ప్రయాణం: రూ.3వేల 300కు పెంపు… అత్యధిక ధర రూ.9వేల 800
* 60-90 నిమిషాల ప్రయాణానికి రూ.4000,
* 90-120 నిమిషాలకు రూ.4వేల 700,
* 120-150 నిమిషాలకు రూ.6వేల 100,
* 180-210 నిమిషాలకు 8వేల 700 దిగువ పరిమితి.