Rajasthan : ప్రియుడితో పారిపోయిన పెళ్లికూతురి ఇంట్లోనే మకాం వేసిన పెళ్లికొడుకు.. చివరికి ట్విస్ట్ ఏంటంటే?

కాసేపట్లో పెళ్లి జరగబోతోంది. సడెన్‌గా పెళ్లికూతురు కనిపించకుండా పోయింది. కట్ చేస్తే పెళ్లికూతురు ప్రియుడితో పారిపోయింది. నిజానికి పెళ్లికొడుకు షాకవ్వాలి.. అలా జరగలేదు .. పెళ్లికి వచ్చినవారు షాకయ్యారు. అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే?

Rajasthan : ప్రియుడితో పారిపోయిన పెళ్లికూతురి ఇంట్లోనే మకాం వేసిన పెళ్లికొడుకు.. చివరికి ట్విస్ట్ ఏంటంటే?

Rajasthan

Rajasthan Bride : రాజస్ధాన్‌లో విచిత్రమైన పరిస్థితుల మధ్య జరిగిన ఓ పెళ్లి గురించి చెప్పాలి. కాసేపట్లో  పెళ్లిపీటలపై కూర్చోవాల్సిన పెళ్లికూతురు ప్రియుడితో పారిపోయింది. నిజానికి పెళ్లి ఆగిపోవాలి కదా.. కానీ ఈ పెళ్లి  నిశ్చయించిన వ్యక్తితోనే జరిగింది. కానీ 13 రోజుల తర్వాత. ఇదేం ట్విస్ట్ అంటే.. చదవండి.

Rajasthan: ముఖ్యమంత్రి పుట్టిన రోజు కోసం వేసిన హోర్డింగ్ ఎత్తుకెళ్లిన దొంగలు.. రాజస్థాన్‭లో వింత ఘటన

చాలా సినిమాల్లో కాసేపట్లో పెళ్లి ముహూర్తం అనగానే పెళ్లికూతురో.. పెళ్లికొడుకో జంప్ అనే సీన్స్ చూస్తుంటాం. అలాంటిదే రాజస్ధాన్‌లోని సైనా గ్రామంలో జరిగింది. పెళ్లి తంతు మొదలవ్వగానే అందంగా ముస్తాబైన పెళ్లికూతురు మనీషా ప్రియుడితో పారిపోయింది. ఈ సమయంలో మగపెళ్లివారు ఏం చేస్తారు? ఆడపెళ్లివారిని దుమ్మెత్తి పోసి ఆ పెళ్లి రద్దు చేసుకుని ఇంటికి సర్దుకుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్.. వరుడు శ్రావణ్ కుమార్ ఏ మాత్రం కంగారు పడలేదు. వధువు ఇంట్లోనే ఉండిపోయాడు. పెళ్లికొచ్చిన వాళ్లంతా ఖంగు తిన్నారు. అతను దాదాపు 13 రోజులు వధువు ఇంట్లోనే మకాం వేశాడు. ఆమె తిరిగి ఇంటికి వస్తే ఆమెనే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చున్నాడు.

Rajasthan : 7 ఏళ్ల బాలికను రూ.4.50 లక్షలకు కొనుగోలు చేసి పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు

ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనీషా కోసం తీవ్రంగా గాలించారు. మొత్తానికి ఆమెను వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రులు ఆమెను ఒప్పించి సంప్రదాయ బద్ధంగా శ్రావణ్ కుమార్‌కి ఇచ్చి పెళ్లిచేశారు. మొత్తానికి శ్రావణ్ కుమార్ మనీషానే పెళ్లి చేసుకోవాలన్న పంతాన్ని అలా నెగ్గించుకున్నాడు.