IPL 2023, RR vs GT: ప్ర‌తీకారం తీర్చుకున్న గుజ‌రాత్‌.. రాజ‌స్థాన్ పై ఘ‌న విజ‌యం

ఐపీఎల్‌(IPL) 2023లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals)తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans) 9 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది

IPL 2023, RR vs GT: ప్ర‌తీకారం తీర్చుకున్న గుజ‌రాత్‌.. రాజ‌స్థాన్ పై ఘ‌న విజ‌యం

GT Win

Updated On : May 5, 2023 / 10:31 PM IST

IPL 2023, RR vs GT: గుజ‌రాత్ టైటాన్స్ ప్ర‌తీకారం తీర్చుకుంది. ఐపీఎల్‌(IPL) 2023లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals)తో జ‌రిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా ఈ సీజ‌న్‌లో రాజ‌స్థాన్ చేతిలో ఎదురైన ఓట‌మికి ఘ‌నంగా ప్ర‌తీకారం తీర్చుకుంది గుజ‌రాత్.

119 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 13.5 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోయి ఛేదించింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో వృద్ధిమాన్ సాహా(41 నాటౌట్; 34 బంతుల్లో 5 ఫోర్లు), శుభ్‌మ‌న్ గిల్‌(36; 35 బంతుల్లో 6 ఫోర్లు) రాణించ‌గా హార్ధిక్ పాండ్యా(39 నాటౌట్; 15 బంతుల్లో 3 ఫోరు, 3 సిక్స‌ర్లు) దంచికొట్టాడు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో చాహ‌ల్‌ ఓ వికెట్ తీశాడు.

IPL 2023, RR vs GT: హార్దిక్ పాండ్యా దూకుడు.. రాజ‌స్థాన్‌పై గుజ‌రాత్ ఘ‌న విజ‌యం

అంత‌క‌ముందు టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 17.5 ఓవ‌ర్ల‌లో 118 ప‌రుగుల‌కు ఆలౌలైంది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో సంజు శాంస‌న్‌(30; 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ట్రెంట్ బౌల్ట్ (15), జైశ్వాల్ (14), ప‌డిక్క‌ల్ (12)లు రెండు అంకెల స్కోరు చేయ‌గా ధ్రువ్ జురెల్(9), బ‌ట్ల‌ర్‌(8), షిమ్రాన్ హెట్మెయర్(7), ప‌రాగ్‌(4) లు తీవ్రంగా నిరాశ‌ప‌రిచారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ మూడు, నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీయ‌గా ష‌మీ, హార్దిక్ పాండ్యా, జాషువా లిటిల్ లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

Virat Kohli: కోచ్‌ను విరాట్ కోహ్లి అలా మోసం చేసేవాడ‌ట‌.. ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పిన చిన్న‌నాటి ఫ్రెండ్‌