Gurthunda Seetakalam: మరోసారి డేట్ మార్చుకున్న గుర్తుందా శీతాకాలం.. ఈసారి ఎప్పుడంటే?

టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ మూవీ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను గతంలోనే రిలీజ్ చేస్తామంటూ చిత్ర యూనిట్ ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ను వాయిదా వేస్తూ వచ్చారు.

Gurthunda Seetakalam: మరోసారి డేట్ మార్చుకున్న గుర్తుందా శీతాకాలం.. ఈసారి ఎప్పుడంటే?

Gurthunda Seetakalam Changes Release Date

Gurthunda Seetakalam: టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ మూవీ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను గతంలోనే రిలీజ్ చేస్తామంటూ చిత్ర యూనిట్ ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ను వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమాలో అందాల భామ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Gurthunda Seethakalam: శీతాకాలం రాకముందే వస్తోన్న ‘గుర్తుందా శీతాకాలం’

అయితే ఈ సినిమాను పలుమార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా, మళ్లీ వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పినా, మళ్లీ వాయిదా వేశారు. ఇక ఇప్పుడు మరోసారి ఈ సినిమా సరికొత్త రిలీజ్ డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను డిసెంబర్ 09న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

Gurthunda Seethakalam: ఎట్టకేలకు రిలీజ్ డేట్‌తో వచ్చిన గుర్తుందా శీతాకలం!

ఆర్.నాగశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో మేఘా ఆకాష్ మరో హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. కాళ భైరవ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండగా భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈసారైనా అనుకున్న డేట్‌కు ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.