Hyderabad Rains: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, స్తంభించిన విద్యుత్ సరఫరా

: వాతావరణ శాఖ సూచించినట్లుగా నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన కొద్ది గంటల్లోనే వాతావరణంలో మార్పులు కనిపించాయి.

Hyderabad Rains: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, స్తంభించిన విద్యుత్ సరఫరా

Rains

Updated On : June 14, 2022 / 6:22 AM IST

 

 

Hyderabad Rains: వాతావరణ శాఖ సూచించినట్లుగా నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన కొద్ది గంటల్లోనే వాతావరణంలో మార్పులు కనిపించాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన మేడ్చల్ జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదైంది.

కొంపల్లి, సుచిత్ర, చింతల్, జగద్గిరి గుట్ట, బాలానగర్, సూరారం, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, గండిమైసమ్మ, గాజులరామారం, షాపూర్ నగర్, కుషాయిగూడలో భారీ వర్షం కురిసినట్లు తెలిసింది.

స్తంభించిన విద్యుత్ సరఫరా:
చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడెంలో భారీ వర్షం కురియడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్ ఏరియాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఫలితంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Read Also: భాగ్యనగరంలో దంచికొట్టిన వర్షం.. ఈదురు గాలులకు కూలిన హోర్డింగ్స్..

ఇదిలా ఉంటే తిరుమలగిరి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, కార్ఖానా, ఏఎస్ రావు నగర్, కుషాయిగూడ, కాప్రా, కీసర, మల్కాజ్ గిరి, నేరేడ్ మెట్, అల్వాల్, బొల్లారం ప్రాంతాలు నీటితో నిండిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.

సోమవారం ఉదయం అందిన రిపోర్టు ప్రకారం.. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో పలు చోట్ల రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని వాతావరణశాఖ వెల్లడించించింది.