Heavy Rain: ఆ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వ‌ర్షం ప‌డొచ్చు.. తెలంగాణ‌లో నేడు, రేపు అతి భారీ వ‌ర్షాలు!

నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్న‌ట్లు హైద‌రాబాద్‌ వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది. నిజామాబాద్, జ‌గిత్యాల‌, నిర్మ‌ల్ జిల్లాల ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏకంగా 61 సెంటీ మీట‌ర్ల మేర వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. రాష్ట్రంపై ఉన్న మేఘాల ఉద్ధృతి న‌మూనాల‌ను ప‌లుమార్లు ప‌రిశీలించి ఈ మేర‌కు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

Heavy Rain: ఆ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వ‌ర్షం ప‌డొచ్చు.. తెలంగాణ‌లో నేడు, రేపు అతి భారీ వ‌ర్షాలు!

Rain

Heavy Rain: తెలంగాణ రాష్ట్రానికి భారీ వ‌ర్షం ముప్పు పొంచి ఉంది. మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. సోమ‌, మంగ‌ళ‌వారాల్లో అత్యంత భారీ స్థాయిలో వ‌ర్షంప‌డే అవ‌కాశాలున్న‌ట్లు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. నిజామాబాద్, జ‌గిత్యాల‌, నిర్మ‌ల్ జిల్లాల ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏకంగా 61 సెంటీ మీట‌ర్ల మేర వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. రాష్ట్రంపై ఉన్న మేఘాల ఉద్ధృతి న‌మూనాల‌ను ప‌లుమార్లు ప‌రిశీలించి ఈ మేర‌కు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

భారీ వ‌ర్షాల‌తో తెలంగాణ స‌ర్కార్ అల‌ర్ట్‌

ఒడిశా, ఉత్త‌రాంధ్ర మీదుగా రాష్ట్రంపై ద‌ట్ట‌మైన మేఘాలు క‌మ్ముకున్నాయ‌ని, అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో కురుస్తున్న వ‌ర్షాలు మ‌రింత భారీగా ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గ‌డిచిన రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిశాయి. 20 ప్రాంతాల్లో అతి భారీ వ‌ర్షం, 56 ప్రాంతాల్లో భారీ వ‌ర్షం న‌మోద‌మైంది. రాష్ట్ర వ్యాప్తంగా 344 ప్రాంతాల్లో సెంటీ మీట‌ర నుంచి 10 సెంటీ మీట‌ర్ల వ‌ర‌కు వ‌ర్షం కురిసింది. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లోనూ ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కురుస్తుండ‌టంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెలంగాణ‌లో మూడ్రోజుల పాటు స్కూళ్ల‌కు సెల‌వులు

రాబోయే రెండుమూడు రోజులు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. వ‌ర్షాల‌పై సీఎం కేసీఆర్ అధికారుల‌తో స‌మీక్షించారు. మూడు రోజుల పాటు (సోమ‌, మంగ‌ళ‌, బుధ‌) విద్యా సంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్
వాతావ‌ర‌ణ శాఖ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. 11, 12 తేదీల్లో నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, ఆసిఫాబాద్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాల్లో అత్యంత భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, కామారెడ్డి, ఉమ్మ‌డి ఖ‌మ్మం, న‌ల్గొండ‌, వ‌రంగ‌ల్ , మెద‌క్ జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. ఇక జ‌న‌గామ‌, సిద్ధిపేట‌, హైద‌రాబాద్ ప్రాంతాల్లో సాధార‌ణ వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు హైదాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంచ‌నా వేశారు.