Sharwanand : సైలెంట్ గా నిశ్చితార్థం చేసేసుకున్న శర్వానంద్.. ఎవర్నో తెలుసా??

తాజాగా రిపబ్లిక్ డే జనవరి 26న శర్వానంద్ తన నిశ్చితార్థం ఫోటోలని షేర్ చేసి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. అతి తక్కువ మంది మధ్యలో, కేవలం కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిధులు, శర్వా సన్నిహితుల మధ్య హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో శర్వానంద్......................

Sharwanand : సైలెంట్ గా నిశ్చితార్థం చేసేసుకున్న శర్వానంద్.. ఎవర్నో తెలుసా??

hero Sharwanand engaged with rakshita

Sharwanand :  టాలీవుడ్ హీరోలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరు శర్వానంద్. వైవిధ్యమైన కథలతో మెప్పిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సైడ్ హీరో నుంచి హీరోగా ఎదిగిన శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఒకేఒక జీవితం అనే సినిమాతో మంచి విజయం సాధించాడు. గత కొన్ని రోజుల నుంచి శర్వానంద్ పెళ్లి వార్తలు వినిపిస్తున్నా దానిపై శర్వా అధికారికంగా స్పందించలేదు.

తాజాగా రిపబ్లిక్ డే జనవరి 26న శర్వానంద్ తన నిశ్చితార్థం ఫోటోలని షేర్ చేసి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. అతి తక్కువ మంది మధ్యలో, కేవలం కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిధులు, శర్వా సన్నిహితుల మధ్య హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో శర్వానంద్ నిశ్చితార్థం చేసుకున్నాడు. రక్షిత అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని శర్వా నిశ్చితార్థం చేసుకున్నాడు. రక్షిత ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వర్క్ చేస్తుందని సమాచారం. రక్షిత మాజీ మంత్రి, టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు. అయితే వీరిద్దరిది లవ్ మ్యారేజినా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది ఇంకా తెలియలేదు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు. ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. రామ్ చరణ్, చిరంజీవి, నాగార్జున, అల్లరి నరేష్, సాయి రామ్ శంకర్, దిల్ రాజు ఫ్యామిలీలతో పాల్గొన్నారు. అలాగే తరుణ్, వడ్డే నవీన్, శ్రీకాంత్, రానా, గౌతమ్, సిద్దార్థ్, అదిరిరావు హైదరి.. మరికొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Raveena Tandon : KGF నటి, ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి పద్మశ్రీ.. త్వరలో 100 సినిమాలు..

శర్వానంద్, రక్షిత నిశ్చితార్థం ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇటీవలే బాలకృష్ణ షోలో ప్రభాస్ చేసుకున్నాకే నేను పెళ్లి చేసుకుంటాను అని శర్వానంద్ చెప్పడంతో సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలని వైరల్ చేస్తూ ప్రభాస్ అన్నని మోసం చేశావుగా అంటూ సరదాగా మీమ్స్ వేస్తున్నారు. ఈ కొత్త జంటకి టాలీవుడ్ ప్రముఖులతో పాటు, అభిమానులు. నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sharwanand (@imsharwanand)

 

View this post on Instagram

 

A post shared by Sharwanand (@imsharwanand)