Russell Crowe – Kangana Ranaut : కంగన హాలీవుడ్ మూవీ..!

టాలెంటెడ్ బ్యూటీతో కంగనతో కలిసి సినిమా చెయ్యడానికి ‘గ్లాడియేటర్’ ఫేం రస్సెల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట..

Russell Crowe – Kangana Ranaut : కంగన హాలీవుడ్ మూవీ..!

Russell Crowe Kangana Ranaut

Updated On : August 14, 2021 / 3:34 PM IST

Russell Crowe – Kangana Ranaut: కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్.. హాలీవుడ్ యాక్షన్ స్టార్ రస్సెల్ క్రోవ్.. వీళ్లిద్దరూ కలిసి యాక్ట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్, అంతే డిఫరెంట్ క్యారెక్టర్లతో నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు కంగనా..

Evaru MeeloKoteeswarulu : ‘వస్తున్నా.. ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా’..

ఇప్పుడీ టాలెంటెడ్ బ్యూటీతో కలిసి సినిమా చెయ్యడానికి ‘గ్లాడియేటర్’ ఫేం రస్సెల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఈ మేరకు ఫ్యాన్స్ చేసిన ట్వీట్‌ను ఆయన రీ ట్వీట్ చేశారు. ‘రెండు డిఫరెంట్ ఫిలిం ఇండస్ట్రీలకు చెందిన ఇద్దరు గ్రేట్ యాక్టర్స్.. అకాడమీ అవార్డ్ విన్నర్ రస్సెల్ క్రోవ్, నాలుగు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న కంగనా రనౌత్ కలిసి వర్క్ చేస్తే ఎంత బాగుంటుంది?’.. అంటే ఓ అభిమాని ట్వీట్ చేశారు.

Kangana Ranaut: కంగనాలో కొత్త యాంగిల్.. కుర్రకారుకి కునుకు కరువాయే!

‘కంగన – రస్సెల్.. క్రేజీ కాంబినేషన్ ఇది. వీళ్ల కలయికలో సినిమా అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ వార్త నిజమైతే బాగుండు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఎ బ్యూటిఫుల్ మైండ్’, ‘ ది నైస్ గైస్’, ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’, ‘గ్లాడియేటర్’ వంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న రస్సెల్ ప్రస్తుతం ‘థోర్: లవ్ అండ్ థండర్ కో’ లో నటిస్తున్నారు. కంగన, జయలలిత క్యారెక్టర్‌లో నటించిన ‘తలైవి’ రిలీజ్‌కి రెడీగా ఉంది. ‘తేజస్’ మూవీలో పైలెట్ పాత్రలో కనిపించనుంది కంగన రనౌత్.