Whatsapp Payment: వాట్సాప్ ద్వారా మీ బ్యాంకు బాలన్స్ ఇలా తెలుసుకోండి

ఇటీవల వాట్సాప్ వినియోగదారులకు UPI పేమెంట్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. నగదు లావాదేవీలు, బ్యాంకు బాలన్స్ చెక్ చేసుకోవడం వంటి పనులు చక్కబెట్టుకోవచ్చు

Whatsapp Payment: వాట్సాప్ ద్వారా మీ బ్యాంకు బాలన్స్ ఇలా తెలుసుకోండి

Payment

Whats App Payment: భారత్ లో UPI పేమెంట్ విధానం ద్వారా డిజిటల్ చెల్లింపులు సులభతరం అయ్యాయి. ఈ విదహనం ద్వారా బ్యాంకు ఖాతాకు అనుసంధానం అయిన ఫోన్ నెంబర్ ఆధారంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇటీవల వాట్సాప్ వినియోగదారులకు UPI పేమెంట్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది ఆ సంస్థ. నగదు లావాదేవీలు, బ్యాంకు బాలన్స్ చెక్ చేసుకోవడం వంటి పనులు చక్కబెట్టుకోవచ్చు. ఇందుకోసం వినియోగదారులు ముందుగా యాప్ లో బ్యాంకు నుండి బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకునేలా ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ బ్యాంకుకు అనుసంధానించి ఉండాలి. అదే సమయంలో బ్యాంకు అకౌంట్ నెంబర్ కి UPI పేమెంట్ ఐడి కలిగివుండాలి. ఇక వాట్సాప్ ద్వారా బ్యాంకు బాలన్స్ చెక్ చేసుకునేందుకు రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి యాప్ సెట్టింగ్స్ ద్వారా, మరొకటి లావాదేవీ జరిపినపుడు.

Also Read: New Smartphones in 2022: జనవరి 2022లో వస్తున్న 5 టాప్ స్మార్ట్ ఫోన్స్

సెట్టింగ్స్ ద్వారా బ్యాంకు బాలన్స్ చెక్ చేసుకునే విధానం:
– Whats App తెరవండి
– Android ఉపయోగిస్తుంటే More ఆప్షన్ పై క్లిక్ చేయండి
– iPhone ఉపయోగిస్తుంటే, యాప్ సెట్టింగ్‌లకు వెళ్లండి.
– Payments పై క్లిక్ చేయండి
– Payments లో ఉన్న మీ బ్యాంక్ ఖాతాను క్లిక్ చేయండి.
– View account balance ఆప్షన్ పై క్లిక్ చేయండి
– మీ UPI పిన్‌ని ఎంటర్ చేసి బ్యాలెన్స్‌ని చెక్ చేయండి

లావాదేవీ జరిపినప్పుడు బ్యాంకు బాలన్స్ చెక్ చేసుకోవడం:
– పేమెంట్ నోటిఫికేషన్ స్క్రీన్ లో “preferred payment” ఆప్షన్ పై క్లిక్ చేయండి
– ‘View account balance’ పై క్లిక్ చేయండి
– మీ బ్యాంకు ఖాతాను ఎంచుకోండి
– పిన్ ఎంటర్ చేసి బ్యాంకు బాలన్స్ చెక్ చేసుకోవచ్చు

కేవలం లేటెస్ట్ అప్డేటెడ్ వాట్సాప్ వినియోగదారులు మాత్రమే పేమెంట్స్ చేసేందుకు వీలుంటుంది. బ్యాంకు ఖాతాను UPI ఐడితో, ఫోన్ నెంబర్ తో మాత్రమే అనుసంధానం చేసుకుంటేనే లావాదేవీలు జరపగలరని గుర్తుంచుకోండి.

Also read: Upcoming Web-Series: ఓటీటీల్లో త్వరలో రానున్న వెబ్ సిరీస్ లు