WhatsApp Unwanted Files : మీ ఫోన్‌లో వాట్సాప్ అనవసర డేటాను ఒకేసారి ఎలా డిలీట్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

WhatsApp : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (Whatsapp) కేవలం మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు.. యూజర్లు తమ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, GIFలు, స్టిక్కర్‌లను కూడా షేర్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.

WhatsApp Unwanted Files : మీ ఫోన్‌లో వాట్సాప్ అనవసర డేటాను ఒకేసారి ఎలా డిలీట్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

How to delete all unwanted WhatsApp photos, videos, and other media files at once

WhatsApp Unwanted Files : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (Whatsapp) కేవలం మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు.. యూజర్లు తమ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, GIFలు, స్టిక్కర్‌లను కూడా షేర్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. వాట్సాప్ ప్యూజర్ ఇంటర్‌ఫేస్, ప్రైవసీని మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌లను రిలీజ్ చేస్తుంది. అయినప్పటికీ, కొత్త అప్‌డేట్‌ షేర్డ్ మీడియా, డేటా మొత్తం స్టోరేజ్‌లో నిండిపోవడం, స్మార్ట్‌ఫోన్ ఇంటర్నల్ మెమరీకి అడ్డంకిగా మారుతుంది. అప్పుడు మీ ఫోన్ స్టోరేజ్ చాలా స్లోగా మారిపోతుంది.

వాట్సాప్ యాప్‌ (Whatsapp)ద్వారా స్పేస్‌ను క్లియర్ చేసేందుకు WhatsApp యూజర్లకు అనుమతిస్తుంది. మెమెరీ స్పేస్ ఖాళీ చేసేందుకు పెద్ద వీడియోలు, ఫొటోలు లేదా మీ ఫోన్‌లో సేవ్ చేసిన ఫైల్స్ వంటి యాప్ డేటాను డిలీట్ చేయాలి. మీరు వాట్సాప్ మీడియాను మేనేజ్ చేయడానికి ఇకపై మీకు కావలసిన ఫైల్‌లను డిలీట్ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ముందుగా, WhatsApp స్టోరేజీని ఎలా చూడాలి? ఏదైనా డేటాను డిలీట్ చేసే ముందు.. మీ స్మార్ట్‌ఫోన్‌లలో WhatsApp ఎంత స్పేస్ తీసుకుంటుందో చెక్ చేయండి. ఇంటర్నల్ స్టోరేజీని క్లియర్ చేయడానికి మీరు తర్వాత అంశాలను డిలీట్ చేయవచ్చు.

How to delete all unwanted WhatsApp photos, videos, and other media files at once

How to delete all unwanted WhatsApp photos, videos, and other media files at once

WhatsApp Data చెక్ చేయండిలా :
WhatsApp> Settings> Storage and data > Manage storageపై Click చేయండి. మీరు అందుబాటులో ఉన్న ఫోన్ మెమరీతో పాటు WhatsApp మీడియా ఎంత స్పేస్ తీసుకుంటుందో చెక్ చేయవచ్చు.

WhatsApp మీడియాను ఎలా రివ్యూ చేయాలి? ఎలా డిలీట్ చేయాలంటే? :
వాట్సాప్ స్టోరేజీని వీక్షించిన తర్వాత మీరు మీడియాను రివ్యూ చేయవచ్చు. పెద్దగా ఉన్న లేదా చాలాసార్లు ఫార్వార్డ్ చేసిన మీడియా ఫైళ్లను డిలీట్ చేయడం ద్వారా స్టోరేజీని క్లియర్ చేయవచ్చు. మీరు చాట్ ప్రకారం.. మీడియాను కూడా డిలీట్ చేయవచ్చు.

* మీడియాను రివ్యూ చేయడానికి లేదా డిలీట్ చేయడానికి ఇలా చేయవచ్చు.
* స్టోరేజీని మేనేజ్ చేసే ముందు ‘Larger than 5 MB’పై Tap చేయండి లేదా నిర్దిష్ట చాట్‌ను ఎంచుకోండి.
* మీరు Sort icon సరికొత్త, పాత లేదా Largest ఆప్షన్ ట్యాప్ చేయడం ద్వారా మీడియాను Sort చేయవచ్చు.
* పర్సనల్ లేదా మల్టీ మీడియాను ఎంచుకుని Tap చేయండి. ఆపై delete ఆప్షన్ ఎంచుకోండి.

Read Also :  WhatsApp Search Groups : వాట్సాప్ చాట్ లిస్టులో ఇకపై గ్రూపులను ఈజీగా సెర్చ్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

మీరు WhatsApp నుంచి మీడియాను డిలీట్ చేసిన తర్వాత కూడా అది మీ ఫోన్ స్టోరేజీలో అందుబాటులో ఉండవచ్చని గుర్తుంచుకోండి. కాబట్టి దీన్ని శాశ్వతంగా డిలీట్ చేయడానికి గ్యాలరీ నుంచి కూడా డిలీట్ చేయండి అనే ఆప్షన్ ఎంచుకోండి.
మీరు అనుకోకుండా కొన్ని ఫైల్‌లను డిలీట్ చేసి ఉంటే.. మీరు డిలీట్ చేసిన WhatsApp ఫొటోలు, వీడియోలను కూడా రీస్టోర్ చేసుకోవచ్చు.

వాట్సాప్‌లో సెర్చ్ ద్వారా మీడియా ఫైల్స్ డిలీట్ చేయాలంటే? :

* మీరు కొత్త ఫిల్టర్ సెర్చ్ ఫీచర్‌ని ఉపయోగించడం ద్వారా పర్సనల్ మీడియాను కూడా డిలీట్ చేయవచ్చు.
* వాట్సాప్ చాట్స్ Tab ఓపెన్ చేసి ఆపై Search ఆప్షన్ Tap చేయండి.
* ఫోటోలు, వీడియోలు లేదా డాక్యుమెంట్‌లను మీరు సెర్చ్ చేసి డిలీట్ చేయాలనుకునే మీడియాను ఎంచుకోండి.
* మీరు డిలీట్ చేయాలనుకునే ఫైళ్లనుTap చేయండి. ఆపై Open చేయండి.
* ఇప్పుడు More > Deleteపై Tap చేయండి.

How to delete all unwanted WhatsApp photos, videos, and other media files at once

How to delete all unwanted WhatsApp photos, videos, and other media files at once

వాట్సాప్‌లో Upload Quality లిమిట్ ఎలా సెట్ చేయాలంటే? :

మీడియా అప్‌లోడ్ క్వాలిటీ లిమిట్ సెట్ చేసేందుకు కూడా WhatsApp యూజర్లను అనుమతిస్తుంది.
* WhatsApp సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి.
* Storageతో పాటు Dataపై Tap చేయండి.
* మీడియా అప్‌లోడ్ క్వాలిటీపై అందుబాటులో ఉన్న ఆప్షన్ల కింద Auto, Best Quality లేదా Data Saver సెట్ చేయండి.
* వినియోగదారులు మీడియా ఆటో డౌన్‌లోడ్‌ను కూడా కంట్రోల్ చేయవచ్చు.
* తద్వారా అనవసరమైన మీడియా మొబైల్ డేటా లేదా Wi-Fiలో ఆటో డౌన్‌లోడ్ చేయదని గుర్తించాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Live Location on WhatsApp : మీ వాట్సాప్‌లో ‘లైవ్ లొకేషన్’ ఫీచర్ ఎలా ఉపయోగించాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!