Huzurabad bypoll : పెరుగుతున్న కరోనా కేసులు

Huzurabad bypoll : పెరుగుతున్న కరోనా కేసులు

Huzurabad Bypoll Increasing Corona Cases

Huzurabad bypoll : హుజూరాబాద్ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఉప ఎన్నికల నేపధ్యంలో రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారంతో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాల్లో ఎక్కడా కూడా కోవిడ్ నిబంధనలు పాటించక పోవడంతో చాల మంది వైరస్ బారిన పడుతున్నారు. పెరుగుతున్నపాజిటివ్ కేసులతో హుజూరాబాద్ ప్రజలే కాదు… ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చే నేతలు కూడా వణికి పోతున్నారు.

కరీంనగర్ జిల్లా పరిధిలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఉప ఎన్నికల నేపధ్యంలో రాజకీయ పార్టీలు కొవిడ్ నిబంధనలకు తిలోదాలు ఇచ్చి ప్రచారాన్ని కొనసాగిస్తుండడంతో పాజిటివ్ కేసులు సంఖ్య పెరగడానికి ఓ కారణంగా వైద్యులు చెప్తున్నారు. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో హుజూరాబాద్ వాసులు భయందోళన చెందుతున్నారు.

ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలకు పెద్ద ఎత్తున జనం గుమిగూడుతున్నారు. ర్యాలీల్లో పాల్గొనే జనం ఏ మాత్రం ఇష్టారీతిన తిరుగుతుండడంతో నియెజకవర్గంలో కరోన విజృంభిస్తోంది. గడిచిన 12 రోజుల్లో జిల్లాలోని పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో నిర్వహించిన యాంటీజేన్ టెస్టుల్లో వెయ్యి 95 కేసులు నమోదు కాగా, వాటిలో ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో మాత్రమే 374 పాజిటివ్ నమోదయ్యాయి.

హుజూరాబాద్ మండలంలో 246 మందికి, జమ్మికుంటలో 59, వీణవంకలో 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడున్నర లక్షల జనాభా ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెలలో నమోదైనవి 229 కేసులు మాత్రమే. కానీ హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే కేసులు నమోదు కావడంతో ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. థర్డ్ వేవ్ వ్యాప్తి నేపధ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సభలు, సమావేశాల్లో పాల్గొనే వారంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన వైరస్ కాటుకు బలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.