CP Anjanikumar : తొలిసారి పీవీ మార్గ్ లోనూ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : సీపీ అంజనీకుమార్

ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. తొలిసారి పీవీ మార్గ్ లోనూ నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

CP Anjanikumar : తొలిసారి పీవీ మార్గ్ లోనూ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : సీపీ అంజనీకుమార్

Cp

arrangements for Ganesh’s immersion : ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. తొలిసారి పీవీ మార్గ్ లోనూ నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. గణేశ్‌ నిమజ్జనం కోసం భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. 27 వేల మంది పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌తో నిఘా పెట్టామని వెల్లడించారు.

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా విగ్రహాల నిమజ్జనాలపై పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. సీసీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తారని తెలిపారు. మహిళల భద్రత కోసం షికాగోయల్ నేతృత్వంలో షీ టీమ్స్ పని చేస్తాయని తెలిపారు. 276 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.

Tank Bund : గణేష్ నిమజ్జనం, ట్యాంక్ బండ్‌‌పై 40 క్రేన్లు..ప్రత్యేక నిఘా

బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. నగరంలో రేపు వైన్ షాపులు తెరిచేందుకు అనుమతి లేదన్నారు. 2.5 కి.మీ పొడవునా ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర ఉంటుందని తెలిపారు. క్రేన్ నెంబర్ 4 ద్వారా ఖైరతాబాద్ గణేష్ ని నిమజ్జనం జరుగుతుందని తెలిపారు.

గణేశ్ నిమజ్జనానికి హైదరాబాద్ రెడీ అవుతోంది. తొమ్మిది రోజుల పాటు భక్తుల చేత పూజలందుకున్న వినాయకుడు మరికొద్ది గంటల్లో గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు నిమజ్జనానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉండడంతో నిమజ్జన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు.

నిమజ్జనం కోసం తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్ర జరిగే మార్గంలో అడుగడుగునా 4 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.